మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు అభిమానుల అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. ఇక మెగా స్టార్ చిరంజీవి మూవీ అంటే పూనకాలు రావడం ఖాయం. సినిమా కథ బాగున్నా.. ఫ్యాన్స్ ని సంతృప్తిపరచడం కాస్త సవాలుతో కూడుకున్నదే. అందుకే దర్శక నిర్మాతలు అభిమానులని దృష్టిలో ఉంచుకొని బాస్ సినిమాలో కొన్ని ఎలెమెంట్స్ తప్పకుండా ఉండేలా చూసుకుంటారు . కానీ చిరు నుంచి రాబోతున్న భోళా శంకర్ సినిమాలో.. ఫ్యాన్స్ ఒక విషయంలో కాస్త నిరాశకు గురైనట్టు తెలుస్తుంది. ఇంతకీ చిరు సినిమాలో ఏం మిస్ అయిందంటే?
ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ హిట్ చిత్రం వేదాళంకి ఈ సినిమా రీమేక్. తమన్నా ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భోళా శంకర్ లో ఐటెం సాంగ్ లేదని తెలుస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ కథకు ఐటెం సాంగ్ అవసరం లేదని భావించారట చిత్ర యూనిట్. దీంతో ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారని తెలుస్తోంది. బాస్ సినిమాలో ఐటెం సాంగ్స్ ఒకప్పుడు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు రీ-ఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాలో “రత్తాలు”, ఇక ఇటీవలే వచ్చిన వాల్తేరు వీరయ్యలో “బాస్ పార్టీ” అంటూ వచ్చిన సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది.
ఐటెం సాంగ్ లేకపోయినా.. చూడాలని ఉంది సినిమాలో “రామ్మా చిలకమ్మా” అనే సాంగ్ ని రీమేక్ చేయడం ఫ్యాన్స్ లో కాస్త ఉత్సాహాన్ని నింపనుంది. 1998 లో వచ్చిన ఈ మాస్ సాంగ్ అప్పట్లో ప్రేక్షకులని ఒక ఊపు ఊపింది. మెలోడీ బ్రహ్మ గా పేరుగాంచిన.. మణిశర్మ చూడాలని ఉంది సినిమాకి సంగీతం అందించగా.. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాకి ఆయన తనయుడు మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చడం విశేషం. మరి ఐటెం సాంగ్ లేకపోయినా.. రామ్మా చిలకమ్మా పాటతో అభిమానులకి మంచి కిక్ ఇస్తారేమో చూడాలి. మరి భోళా శంకర్ సినిమాలో ఐటెం సాంగ్ లేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.