సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు హీరోయిన్ లపైనా.. హీరోయిన్ లకు హీరోలపైనా క్రష్ ఉంటుంది. ఇక ఈ క్రష్ కొంత మందిలో చిన్నప్పటి నుంచి ఉంటుంది. మరికొంత మందిలో తాము కలిసి నటించిన సహ నటులపై క్రష్ ఉంటుంది. ఇలాగే ఆ హీరోపై మనసు పారేసుకుంది బెల్లం శ్రీదేవి రాశి ఖన్నా. తాజాగా రిలీజ్ అయిన అన్ స్టాపబుల్ సీజన్ 2 షో ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కు అలనాటి అందాల తారలు జయసుధ, జయప్రదలతో పాటుగా యాపిల్ బ్యూటి రాశి ఖన్నా సైతం వారితో వచ్చి ఈ షోలు సందడి చేసింది. ఇక బాలకృష్ణ నీ క్రష్ ఎవరు? అంటూ ప్రశ్నించగా.. చిరునవ్వులు చిందిస్తూ.. ఆ హీరోనే నా క్రష్ అంటూ చెప్పుకొచ్చింది.
నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా దూసుకుపోతున్న షో అన్ స్టాపబుల్ సీజన్ 2. తనదైన మాటలతో వచ్చే గెస్ట్ లను నవ్వించడమే కాకుండా.. చిక్కుల ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టి సమాధానాలు రప్పిస్తుంటారు బాలయ్య. ఇక ఈ షోకు ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు వచ్చి తమ అనుభవాలను పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 23 కు సంబంధించిన ఎపిసోడ్ 6 ప్రోమో గ్లింప్స్ ను విడుదల చేశారు షో మేకర్స్. ఇక ఈ ఎపిసోడ్ కు సీనియర్ నటీమణులు అయిన జయసుధ, జయప్రదలతో పాటు హీరోయిన్ రాశి ఖన్నా వచ్చి సందడి చేశారు.
ఎప్పటిలాగే బాలయ్య తన చిలిపి మాటలతో కవ్వించారు. అయితే ఎన్నో ఇంటర్య్వూల్లో తన క్రష్ ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ వచ్చిన రాశి.. బాలయ్య షోలో మాత్రం తన క్రష్ ఎవరో చెప్పేసింది. నువ్వు నటించిన హీరోల్లో నీ క్రష్ ఎవరు? అంటూ బాలయ్య ప్రశ్నించగా.. విజయ్ దేవరకొండ అంటూ ఠక్కున, తడుముకోకుండా చెప్పింది ఈ అమ్మడు. దానికి సంబంధించిన మరిన్నివిషయాలను అభిమానులతో పంచుకుంది. అయితే గతంలో విజయ్ దేవరకొండ-రాశి ఖన్నాలు కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇక సీనియర్ నటులైన జయసుధ, జయప్రదలు వారి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ ఎపిసోడ్ లో గుర్తుకు తెచ్చుకున్నారు.