Pragathi Dance: తెలుగు బుల్లితెరపై వినోద ప్రధానంగా పాపులర్ అయినటువంటి షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. జబర్దస్త్, ఢీ షోల తర్వాత ఆ స్థాయి ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే.. బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హోస్ట్ గా ప్రారంభమైన ఈ షోలో కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ప్రముఖ టీవీ ఛానల్ లో ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ షో.. మొదలైనప్పటి నుండి అటు ఎంటర్టైన్ మెంట్ పరంగా, ఇటు ఎమోషనల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇక ప్రతి ఎపిసోడ్ లో కొత్త కాన్సెప్టులతో పాటు టాలెంట్ ఉండి ప్రోత్సాహం లేనివాళ్లను ఈ స్టేజిపై పరిచయం చేస్తున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కొత్త ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో విడుదలైంది. సినీనటి పూర్ణ జడ్జిగా కనిపించిన ఈ ప్రోమోలో ‘ఆషాడం అల్లుళ్ళు’ అనే కాన్సెప్టుతో ఎంటర్టైన్ చేశారు కమెడియన్స్. అయితే.. ఈ ఎపిసోడ్ లో నటి ప్రగతి స్పెషల్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు.
ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ ప్రోమోలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, నూకరాజు, నరేష్ వీరంతా అల్లుళ్లుగా, ఇక మిగతా లేడీ ఆర్టిస్టులు భార్యలుగా కనిపించగా.. సీరియల్ ఆర్టిస్ట్ తో పాటు నటి ప్రగతి అత్తగా ఎంటర్టైన్ చేయడం విశేషం. అయితే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేసే నటి ప్రగతి.. ఈసారి హైపర్ ఆదితో కలిసి ‘అత్తో అత్తమ్మ కూతురో’ పాటకు మాస్ స్టెప్పులేయడం హైలైట్ గా నిలిచింది.
సారీలో ఉన్నప్పటికీ ప్రగతి.. అటు ఆదితో, ఇటు రాంప్రసాద్ తో కలిసి స్టేజిపై మాస్ డ్యాన్స్ చేయడం గమనించవచ్చు. మరి నటి ప్రగతి డ్యాన్స్, ఎనర్జీ గురించి అందరికీ తెలిసిందే. ఆమె డ్యాన్స్ ని ఆదివారం ‘ఆషాడం అల్లుళ్ళు’ పూర్తి ఎపిసోడ్ లో చూడాల్సిందే. ప్రస్తుతం హైపర్ ఆదితో ప్రగతి డ్యాన్స్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.