బిగ్ బాస్ బ్యూటీ హిమజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించిన హిమజ.. సీరియల్స్, సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు, అడపాదడపా టీవీ షోలు చేస్తూ కెరీర్ లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తోంది. అయితే.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హిమజ పెళ్లి గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
ఈ క్రమంలో తాజాగా మరోసారి హిమజ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు వాళ్ళమ్మ గారు. మదర్స్ డే సందర్భంగా ‘అమ్మకు ప్రేమతో’ అనే టీవీ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదలైంది. ఈ ప్రోగ్రాంకి సీనియర్ నటి జయసుధ గెస్ట్ గా రాగా, టీవీ ఆర్టిస్టులు, సెలబ్రిటీలు వాళ్ళ మదర్స్ ని షోకి తీసుకొచ్చారు. అందరూ వాళ్ళమ్మలకు గిఫ్ట్ ఇచ్చే టైంలో హిమజ కూడా వాళ్ళమ్మకు గిఫ్ట్ ఇవ్వబోయింది.
హిమజ ఇచ్చే గిఫ్ట్ ను వద్దన్న వాళ్ళమ్మ.. తనకంటూ ఓ తోడు ఉంటే బాగుంటుందని.. ఆ ప్రామిస్ చేస్తేనే గిఫ్ట్ తీసుకుంటానని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తల్లి మాటలకు స్పందించిన హిమజ.. తనకు కొంచం టైం కావాలని అడిగి.. వాళ్ళమ్మకు గిఫ్ట్ ఇచ్చింది. కూతురిచ్చిన గిఫ్ట్ లో బంగారు గాజులు చూసి తల్లి మురిసిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మరి ఇప్పటికే హిమజ పెళ్లిపై పలుమార్లు నెట్టింట పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే. మరి ఈసారైనా వాళ్ళమ్మ కోరిక మేరకు త్వరలో పెళ్లి వార్త చెబుతుందేమో చూడాలి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.