సినీ ఇండస్ట్రీని ఇప్పట్లో కష్టాలు వీడేలా కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. మధ్యలో వరదలు కారణంగా భారీ సినిమాల సెట్స్ దెబ్బ తిన్నాయి. ఇక కరోనా ప్రభావం కాస్త తగ్గడంతో అన్నీ సినీ ఇండస్ట్రీలలో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో సెట్స్ లో జరుగుతున్న వరుస ప్రమాదాలు సినీ లవర్స్ ని కలవర పెడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విలన్ గా మలయాళీ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఫైనల్ అయ్యారు. ఇప్పటికే పుష్ప పార్ట్ 1 చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది కూడా. ఈ నేపథ్యంలో ఫహద్ ఫాజిల్ కి మూవీ సెట్ లో యాక్సిడెంట్ కావడం అందరిని షాక్ కి గురి చేసింది. ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం సౌత్ లోనే బిజీ యాక్టర్. పైగా.., వెబ్ మూవీస్, వెబ్ సిరీస్ లతో ఈయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో తన మాతృభాష మాలయంలోనూ ఫాజిల్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో భాగంగా ఫహద్ ఫాజిల్ ప్రస్తుతం ‘మలయాన్‌కుంజు’ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ చిత్రీకరణలో జరిగిన ప్రమాదం సంభవించింది.
‘మలయాన్‌కుంజు’ మూవీ షూటింగ్ లో ఫహద్ ఫాజిల్ చాలా ఎత్తు నుండి కింద పడిపోయాడు.ఆ సమయంలో ఫహద్ చాకచక్యంగా ప్రవర్తించటంతో తలకి బలమైన గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఎత్తు నుండి కిందకు పడుతున్న సమయంలో హ్యాండ్స్ బ్యాలెన్స్ చేయటంతో అదృష్టవశాత్హు బయటపడ్డాడట. ఈ విషయాన్నీ ఫహద్ స్వయంగా వెల్లడించడం విశేషం.”ఆ సమయంలో చేతులు చాచి బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. కాని ఆ సమయంలో మెదడు చురుగ్గా పని చేయడంతో బతికి బట్టగట్టాను’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ యాక్సిడెంట్‌లో ఫహద్ ఫాజిల్ ముక్కుకి స్వల్ప గాయం కావటంతో ఆయనకి మూడు కుట్లు పడ్డాయి. గాయాలు అయినా.., ఆయన ప్రాణాలతో బయటపడడంతో సెట్ లో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం ఆలశ్యంగా తెలుసుకున్న పుష్ప టీమ్ ఫహద్ ఫాజిల్ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంది. అల్లు అర్జున్ కూడా ఫహద్ ఫాజిల్ కి ఫోన్ చేసి.., జాగ్రత్తలు చెప్పినట్టు సమాచారం.ఇక సౌత్ సినిమాలోనే మోస్ట్ ప్రొఫెషినల్ యాక్టర్ గా ముద్రపడ్డ ఫహద్ ఫాజిల్ పుష్ప డబ్బింగ్ కోసం తెలుగు భాష నేర్చుకోవడం విశేషం.