గుడికి వెళ్ళినపుడు కొన్ని పద్దతులు చాలా ఆసక్తిగా కనిపిస్తుంటాయి. గుడిలో ప్రతీదీ ఏదో ప్క ప్రత్యేక విశేషాన్ని కలిగి ఉంటుంది. అందులో గుడి వెనక భాగంలో మొక్కడం అనే దానికి ప్రత్యేక పరమార్థం ఉంది. ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని నమస్కరించడం చూస్తూనే ఉంటారు. దేముడికి దణ్ణం పెట్టేటప్పుడు ఒక చేత్తో ఎప్పుడూ దణ్ణం పెట్టకూడదు. రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టుకోవాలి. అలాగే శాలువా గాని, కంబళిలాంటిది గాని కప్పుకుని దేముడిని దర్శించకూడదు. అలాగే తలపై టోపీ పెట్టుకుని గుడిలోకి వెళ్ళకూడదు. గుడిలో పూసిన పువ్వులను కోసి మళ్లీ గుడిలో దేముడికే పెట్టమని ఇవ్వకూడదు. అలాగే గుడిలో పూవులని ఇంట్లో పూజకి ఉపయోగించకూడదు. ఆలయ మంటపంలో భోజనం చేయకూడదు. తిన్న ప్రసాదం పోట్లాలని అక్కడే పారేయకూడదు.
ద్వజస్థంభానికి గర్భగుడికి మధ్య నుంచి వెళ్ళకూడదు. ద్వజస్థంభం చుట్టూ తిరిగి చేస్తేనే ప్రదక్షిణ పరిపూర్ణం అయినట్టు. దేముడిని దర్శించటానికి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. ఇక గుడి లోపలికి వెళ్ళిన తరువాత ఎప్పుడూ దేముడికి ఎదురుగా నిలబడకూడదు. పక్కగా నిలబడి నమస్కరించాలి. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు శబ్ధం చేయకుండా తీసుకోవాలి. తీర్థం పుచ్చుకున్నకా ఆ చేతిని తలపై రాసుకోకూడదు. ఎందుకంటే మన తలపై పెట్టే శటారి మీద దేముడి పాదాలు ఉంటాయి, ఆ శటారి సాక్షాత్తు దేముడి పాదాలతో సమానం. అలాంటి దేముడి పాదాలకి మనం ఎంగిలి చేసిన చెయ్యి అంటుకుంటుంది కాబట్టి తీర్థం పుచ్చుకున్న చెయ్యి తలపై రాసుకోకూడదు. అలాగే ప్రసాదాన్ని కింద పడకుండా తినాలి.
గుడిలో మూలవిరాట్ గర్భ గుడిలో ఉంటుంది. దాన్ని గుడు పక్క గోడల్లో కాకుండా గర్భ గుడిలోని విగ్రహం వెనకాల ఉంచుతారు. అది వెనకాల గోడకి చాలా దగ్గరగా ఉంటుంది. గర్భగుడిలో ఉన్న మూలవిరాట్ వరకూ వెళ్ళలేరు కాబట్టి దగ్గరగా ఉన్న గోడకి మొక్కుతారు. ఈ మూలవిరాట్ వల్ల విగ్రహానికి అమితమైన శక్తి వస్తుందని నమ్మకం. అందుకే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే వాళ్ళందరూ గుడి వెనక భాగాన్ని మొక్కుతారు