గుడికి వెళ్ళినపుడు కొన్ని పద్దతులు చాలా ఆసక్తిగా కనిపిస్తుంటాయి. గుడిలో ప్రతీదీ ఏదో ప్క ప్రత్యేక విశేషాన్ని కలిగి ఉంటుంది. అందులో గుడి వెనక భాగంలో మొక్కడం అనే దానికి ప్రత్యేక పరమార్థం ఉంది. ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని నమస్కరించడం చూస్తూనే ఉంటారు. దేముడికి దణ్ణం పెట్టేటప్పుడు ఒక చేత్తో ఎప్పుడూ దణ్ణం పెట్టకూడదు. రెండు చేతులూ జోడించి దణ్ణం పెట్టుకోవాలి. అలాగే శాలువా గాని, కంబళిలాంటిది గాని కప్పుకుని దేముడిని దర్శించకూడదు. […]