ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పండుగను కులమతాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుంది రాఖీ. కష్టసుఖాలే కాదు, సందర్భం ఏదైనా చేదోడు, వాదోడుగా నీకు నేన్నున్నాంటూ భరోసా కల్పిస్తూ రక్షాబంధన్ జరుపుకుంటారు. అక్క తమ్ముడికి, చెల్లి అన్నకు రాఖీ కట్టినప్పుడు ఆమెను సంతోష పరచడానికి ఏదైనా కానుక ఇస్తారు. కానుక చిన్నదైనా, పెద్దదైనా అది ఆమెకు ప్రత్యేకమే అవుతుంది. మరి, మీరు గిఫ్ట్ కొన్నారా? లేదా?. ఏం కొనాలో అర్థం కావడంలేదా?. అయితే మీకోసం మేం కొన్ని గిఫ్ట్ ఐడియాస్ తీసుకొచ్చాం ఓసారి చూసేయండి.
ఆడవారికి షాపింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందర్భానికో డ్రస్ కావాలనుకుంటారు. వారి అభిరుచి మీకు పక్కాగా తెలిసుంటే వారు ఇష్టపడేలా ఒక మంచి డ్రస్ కొనేసి సర్‌ప్రైజ్ చేయండి. అదే మీ సోదరికి వివాహం జరిగి ఉంటే.. ఒక మంచి చీరను గిఫ్ట్ చేయండి.
హ్యాండ్ బ్యాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్ని ఉన్నా ఇంకొకటి కావాలని కోరుకుంటారు. హ్యాండ్ బ్యాగ్స్‌లో చాలా రకాలు ఉంటాయి. మీ బడ్జెట్‌లో ఉండేలా మంచి హ్యాండ్ బ్యాగ్ కొనేయండి. మీ సోదరి కూడా చాలా ఆనందిస్తారు.
పోయి, పోయి చెవి దిద్దులు గిఫ్ట్ ఏంటి అంటారా!?. భలే వాళ్లే అవంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టమండి. దిద్దులు, పోగులు, బుట్టలు, ట్రెండీ రింగ్స్ ఇలా చాలానే ఉంటాయి.
ఈ గిఫ్ట్ గురించి ఎంత తక్కువ వర్ణిస్తే అంత మంచిది. ఎందుకంటారా, మహిళలకు మేకప్ అంటే ప్రాణం అని మనకు తెలుసు కదా. అందుకే, ఒక మంచి మేకప్ కిట్ ఒకటి కొనేశారనుకోండి చాలా బావుటుంది కదా.
అందంగా కనిపించాలంటే చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి అందుకోసం మార్కెట్‌లో స్కిన్ లోషన్, ఫెయిర్‌నెస్ క్రీమ్, సన్ గార్డ్ వంటివి దొరకుతూ ఉంటాయి. అవన్నీ కలిపి ఒక గిఫ్ట్ ప్యాక్ చేపించేయండి బావుంటుంది.
అవును ఒక మంచి పర్ఫ్యూమ్ కూడా గిఫ్ట్ చేయొచ్చు. గిఫ్ట్ కోసం వెతుకులాడే టైమ్ లేదనుకొండి, మీ సిస్టర్‌కు నచ్చే ఫ్లేవర్‌లో పర్ఫ్యూమ్ కొనేయండి.
కొందరికైతే ఫుట్‌వేర్ అంటే ప్రాణం. డ్రెసెస్‌కి మ్యాచింగ్ ఫుట్‌వేర్ కూడా కొంటుంటారు. హీల్స్, ఫ్లాట్స్, క్యాజువల్ షూ, పార్టీ వేర్ ఇలా చాలా రకాలే ఉంటాయి మరి. వాటిలో ఏం కొనాలో మీకు తెలిసుంటే ఓ మంచి పాదరక్షల జత కొనేయండి.
అన్నా, తమ్ముడే కాదు… అక్కా, చెల్లెలు కూడా తన సోదరుడికి రాఖీ సందర్భంగా గిఫ్ట్ ఇవ్వొచ్చు, ఇస్తుంటారు కూడా. వారికోసం కూడా మరికొన్ని ఐడియాస్.
కాఫీ మగ్‌ను చాలా సందర్భాల్లో గిఫ్ట్ ఇస్తుంటారు. వాటిలో ప్రింటెడ్ మగ్ స్పెషల్‌గా ఉటుంది. అంతేకాదు, మీ బ్రదర్‌కు పెళ్లైతే కపుల్ మగ్స్ కూడా దొరుకుతాయి. అన్న, వదిన అని వచ్చేలా మంచి మగ్స్ ఉంటాయి.
మీ బంధాన్ని తెలియజెప్పేలా మంచి ఫొటే ఫ్రేమ్‌ని కూడా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. మంచి కొటేషన్‌తో ఒక ఫ్రేమ్ సెలక్ట్ చేసేయండి. ఇప్పుడు ఉడ్ మీద ఫొటోలతో మంచి మంచి ఫ్రేమస్ దొరుకుతున్నాయి.
పిల్లో మీద ఒక మంచి కొటేషన్ ఉంటుంది. బెస్ట్ బ్రదర్ ఎవర్, బెస్ట్ బ్రదర్ ఇన్ ది వరల్డ్. ఇలాంటి కోట్స్‌తో మంచి పిల్లోస్ దొరుకుతాయి. అది కూడా మంచి గిఫ్ట్ అవుతుంది.
అదండి సంగతి… మీకు ఏ ఆలోచనా లేకపోతే మా ఐడియాస్‌లో మీకు నచ్చింది ఒకటి సెలక్ట్ చేసుకుని ఈ రాఖీని మరింత స్పెషల్‌గా జరుపుకోండి. ఈ ఆర్టికల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి.