ప్రశ్నా పత్రంలో సోదరి, సోదరుడి గురించి దారుణమైన ప్రశ్న వస్తే.. రాసే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ యూనివర్శిటీ ప్రశ్నా పత్రంలో ఎవ్వరూ ఊహించని అత్యంత నీచమైన ప్రశ్న వేసింది. జనం దీనిపై ఫైర్ అవుతున్నారు.
సమాజంలో మానవతా విలువులు పూర్తిగా నశించిపోతున్నాయి. మానవ సంబంధాలు, ముఖ్యంగా రక్త సంబంధాలకు ఎలాంటి విలువ లేకుండా పోతోంది. విద్యా సంస్థలే కొన్ని సార్లు మానవ సంబంధాలను మసకబార్చే పనులు చేస్తున్నాయి. మనం ఇంత వరకు చదువుకు సంబంధించిన పిచ్చి పిచ్చి ప్రశ్నలు ప్రశ్నాపత్నంలో చూసి ఉంటాము. కానీ, ఓ యూనివర్శిటీ ఓ అడుగు ముందుకు వేసి జిగుబ్సాకరమైన ప్రశ్నను వేసింది. మానవ సంబంధాలను దారుణంగా చిత్రీకరించింది. సోదరి, సోదరుడి మధ్య లైంగిక సంబంధం అంటూ ప్రశ్న వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కామ్‌షాట్స్ అనే యూనివర్శిటీ ఉంది.
ఈ యూనివర్శిటీలో కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. సదరు యూనివర్శిటీ తమ విద్యార్థులకు కొద్దిరోజుల క్రితం ఓ ఎగ్జామ్ నిర్వహించింది. ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రంలో సోదరి, సోదరుడి సంబంధం గురించి ఓ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్న ఇలా ఉంది.. ‘‘ జూలీ, మార్క్ సోదరి, సోదరుడు.. వారు ఇద్దరూ ఫ్రాన్స్‌లో వేసవి సెలవుల్లో ఉన్నారు. ఓ రోజు రాత్రి ఇద్దరూ బీచ్‌కు దగ్గరలోని చెక్క ఇంట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ శృంగారంలో పాల్గొనాలని అనుకున్నారు. అదే విధంగా చేశారు. అయితే, తర్వాత ఇంకెప్పుడూ అలాంటి తప్పు చేయకూడదని నిశ్చయించుకున్నారు’’ అని ఉంది. తర్వాత కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.
జూలి, మార్క్ ఇద్దరూ శృంగారంలో పాల్గొనటం సబబేనా?.. మరి, మీరేమనుకుంటున్నారో ఉదాహరణలతో సహా వివరించండి అని ఉంది. ఇక, ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రశ్నపై అన్ని వర్గాలనుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. దీనిపై సదరు యూనివర్శిటీ స్పందించింది. ప్రశ్నా పత్రంపై విచారణ చేపట్టింది. ఈ ప్రశ్నను ప్రొఫెషర్ కౌర్ ఉల్ బషర్ అనే ప్రొఫెసర్ ప్రశ్నాపత్నంలో చేర్చినట్లు తేలింది. దీంతో అతడ్ని యూనివర్శిటీనుంచి తీసేశారు. అతడ్ని బ్లాక్ లిస్ట్‌లో సైతం ఉంచారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.