ఈ మధ్యకాలంలో హోమ్ గార్డెనింగ్, టెర్రస్ పై కూరగాయలు పండించడం అనేది ట్రెండ్ అయిపోయింది. సేంద్రియ పద్దతిలో మనకు కావాల్సిన కూరగాయలు, మసాలా దినుసులను టెర్రస్ పై పెంచి, అవసరమైనప్పుడు తెంపుకుని అవసరాలకు వాడుకోవడం చూస్తున్నాం. అయితే.. టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. మరి టెర్రస్‌పై కూరగాయల తోటను ఎలా ఏర్పాటు చేసుకోవాలో చూద్దాం.
1. సూర్యకాంతి పడే ఉపరితలం:
టెర్రస్ మీద స్థలం ఓపెన్ గా ఉండాలి. రోజంతా సూర్యకాంతి పడేలా ఉంటే ఇంకా మంచిది. తోటకు కావాల్సిన నీడ, అలాగే సూర్యకాంతి నేరుగా కాసేపు పడితే చాలు. గుల్మకాండ మొక్కలు చాలా సున్నితమైనవి. ఎండ వేడికి తట్టుకోలేక వాటి ఆకులు తేలికగా వాడిపోతాయి. కాబట్టి గుల్మకాండ మొక్కలను నీడలో ఉంచాలి. మీరు పెంచాలనుకునే మొక్కలను కుండీలలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తీగ రకాలను పెంచాలనుకుంటే వాటికోసం తాత్కాలికమైన పందిరి ఏర్పాటు చేయాలి.
2. ప్రభుత్వం ప్రయోజనాలను ఉపయోగించడం:
పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కొబ్బరి పీచుతో తయారు చేసిన ప్లాస్టిక్ సంచులను అందిస్తుంది. అలాంటి సంచులను కూరగాయలు పండించేందుకు ప్రిఫర్ చేస్తే మంచిది. వాటికోసం విడిగా కుండీలు కొనాల్సిన పనిలేదు. టెర్రస్ మీద కొబ్బరి పొట్టు ఇటుకలను ప్లాస్టిక్ సంచులలో ఉంచి.. ఒక వారం పాటు రోజూ నీళ్లు పోయాలి. ఇటుకలా కనిపించే కొబ్బరి పొట్టు ఒక వారం రోజుల తర్వాత బాగా నాని, ప్లాస్టిక్ సంచిలో చెత్త వదిలేస్తుంది.
3. మట్టి ప్రాసెస్:
పంట పొలాల నుండి సహజమైన మట్టి, సేంద్రియ ఎరువులు కొనుగోలు చేసి వాటిని కొబ్బరి పొట్టుతో కలపాలి. ఎక్కువగా సేంద్రియ ఎరువులను ఉపయోగించాలనుకుంటే.. అందులో గేదె పేడ లేదా మేక పేడను ఎక్కువగా కలపవచ్చు. కావలసిన స్థిరత్వాన్ని పొందడానికి ఈ మిశ్రమాన్ని కొన్ని రోజులు అలాగే ఉంచాలి. ఈ గ్యాప్ లో తొక్కలు, కుళ్లిన కూరగాయలను పారవేయకుండా ప్రత్యేక కుండలో వేసి, కొబ్బరి పొట్టుతో కంపోస్ట్ చేయండి. ఈ మిశ్రమం ఒక వారం తర్వాత విత్తడానికి రెడీ అవుతుంది. తర్వాత మనకు కావలసిన కూరగాయల విత్తనాలు (టమోటా, మిర్చి, కొత్తిమీర మరియు మూలికలు) విత్తుకోవచ్చు. నాటిన విత్తనాలను మట్టిలోకి కొద్దిగా నొక్కాలి. రెండు రోజులు అలా వదిలేయండి. అలా వాటి పెరుగుదల మొదలవుతుంది.
4. పక్షుల నుండి రక్షణ కల్పించడం:
టెర్రస్ పై తోటను ఏర్పాటు చేసుకునే ప్రారంభంలో ఒకటి లేదా రెండు రకాల కూరగాయల విత్తనాలను నాటి చూడాలి. వాటి పెరుగుదల బట్టి తర్వాత వివిధ రకాల కాయల విత్తనాలను నాటవచ్చు. టొమాటోలు, మిరపకాయలు, బచ్చలికూర వంటివి పెరగడం చాలా సులభం. కొన్నిసార్లు పక్షులు విత్తనాలను తినటం లేదా చిన్నచిన్న మొక్కలను పాడు చేయడం చేస్తుంటాయి. వాటి నుండి కాపాడుకునేందుకు మొక్కలకు వలను, లేదా ఏదైనా రక్షణగా పాత చీరలను ఏర్పాటు చేసుకుంటే మంచిది.
5. సమయానికి నీరు అందించడం: టెర్రస్ పై కుండలు పెట్టాక నీరు పోసేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతిరోజూ మొక్కలకు అవసరమైన నీరు అందించాలి. అలాగని ఎక్కువ నీరు పోస్తే మొక్కలు దెబ్బతింటాయి లేదా మొక్కల కాండం కుళ్లిపోతుంది. సమయపాలన వహించాలి. అలాగే 3 – 6 నెలల మధ్య మొక్కలకు ఎరువులను వేయడం చాలా ఉత్తమం. మీకు తెలిసిన సింపుల్ టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.