బెల్లీ ఫ్యాట్ చాలామందికి ఇదో పెద్ద సమస్య. ఈ ఫ్యాట్ ను తగ్గించుకోవడానికి చాలా టిప్స్ ఫాలో అయి ఉంటారు. కొంతమందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. కొన్ని రకాల ఫుడ్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా లేదా స్నాక్స్ గా తీసుకోవడం వల్ల బాడీకి అధిక కేలరీస్ అందడమేగాకుండా బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిపోతుంది.
ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట. ఆరోగ్య కోసం పాటించే సూత్రాల్లో ప్రధానమైనది ఉదయమే లేవడం. ఉదయం పూట లేటుగా లేచే వాళ్లు ఎక్కువగా ఊబకాయానికి గురవుతూ ఉంటారని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల వీలైనవరకు ఉదయం లేవడానికి ప్రయత్నించండి. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఈజీగా కొవ్వు కరిగిపోతుంది. ఆరోగ్యంగా ఉండేందుకు ఫైబర్ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రోజూ రెగ్యులర్ గా ఫైబర్ ఫుడ్ తింటూ ఉండండి. కొన్ని రకాల ఆసనాలు కూడా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా తగ్గిస్తుంది. అందువల్ల అలాంటి ఆసనాలను ఉదయం లేచిన వెంటనే వేస్తే చాలా మంచిది.
మరిన్ని వివరాలకు కింద వీడియో క్లిక్ చేయండి.