ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఫ్లిప్‌కార్ట్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, ఫ్లిప్ కార్ట్ సంయుక్తంగా విశాఖ పట్నంలో ఆగస్ట్ 3న రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నాయి. ఇన్‌స్టాకార్ట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం వేదికగా ఈ ఇంటర్వ్యూలు జరుగనున్నాయి.
ఇండస్ట్రీ కస్టమైజ్‌డ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో టెన్త్ క్లాస్, ఇంటర్, డిప‍్లమో, డిగ్రీ పూర్తి చేసిన వారు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. 71 పోస్టులకు నిర్వహించే ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో అర్హులైన అభ్యర్ధులు విశాఖపట్నం, పరిసర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది. జీతం రూ.20వేల నుంచి రూ.40వేల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ (https://apssdc.in/home/) వెబ్ సైట్‌ను సందర్శించగలరు.
@AP_Skill has Collaborated with @Flipkart to Conduct Industry Customized Skill Training & Placement Program @vizaggoap
For more details on eligibility visit https://t.co/XnrotfY4b3
Contact: G. Srinivas Rao – 9014772885
APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/weLDMXtI3g— AP Skill Development (@AP_Skill) July 29, 2022
ఇదీ చదవండి: HCL TechBee: ఇంటర్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తారు!
ఇదీ చదవండి: SCCL Recruitment: సింగరేణిలో 1300 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఆగష్టు 6 చివరి తేదీ.!