ఇంటర్ పాసయ్యారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీ కోసమే. అనుభవం లేకున్నా గానీ ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవచ్చు. నెలకు రూ. 56 వేలు జీతం పొందే సువర్ణావకాశం. వెంటనే అప్లై చేసుకోండి.
భారత ప్రభుత్వానికి చెందిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేసే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోని పలు పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీకై దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో మొత్తం 4062 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. నాన్ టీచింగ్ విభాగంలో ఇంటర్ పూర్తి చేసిన వారిని కూడా తీసుకుంటున్నారు. మరి ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలు మీ కోసం.
ప్రిన్సిపాల్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు: రూ. 2000/-
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు: రూ. 1500/-
నాన్ టీచింగ్ స్టాఫ్ కి దరఖాస్తు చేసేవారు: రూ. 1000/-
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి