మీరు పదో తరగతి పాసయ్యారా? అయితే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. నెలకు రూ. 69 వేల జీతం పొందే అవకాశం.
మీరు పదో తరగతి పాసయ్యారా? మీకు డ్రైవింగ్ వచ్చా? అయితే కానిస్టేబుల్ డ్రైవర్ ఉద్యోగం మీ కోసమే. నెలకు 69 వేల వరకూ జీతం పొందే ప్రభుత్వం ఉద్యోగం పొందే అవకాశం మీ కోసమే. భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రూప్ సి నాన్ గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) కింద తాత్కాలిక ప్రాతిపదికన కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనుంది. శాశ్వత ఉద్యోగం ఉండే అవకాశం కూడా ఉందని ఐబీపీఎఫ్ ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులను దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరింది. ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు ఇండియాలో ఎక్కడైనా గానీ లేదా విదేశంలో గానీ సేవలు అందించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఐటీబీపీఎఫ్ చట్టం 1992, 1994 మరియు ఎప్పటికప్పుడు వర్తించే ప్రభుత్వ నిబంధనలు, సూచనలు చేత అభ్యర్థులు నిర్వహించబడతారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. వేరే మార్గం లేదు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ధ్రువీకరణ, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, డిటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పరీక్ష ఫీజు, దరఖాస్తు చివరి తేదీ వంటి వివరాలు మీ కోసం.