ఇది వరకే ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 56 వేల జీతం అనే నోటిఫికేషన్ వచ్చింది. దీనికి అప్లై చేసుకోలేదని బాధపడేవారికి మరోసారి అవకాశం కల్పించారు. మరి వెంటనే అప్లై చేసుకోండి.
మీరు ఇంటర్ పాసయ్యారా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. నెలకు రూ. 56 వేల జీతం వచ్చే అద్భుతమైన అవకాశం ఉంది. ఇది వరకే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది. గడువు తేదీ కూడా ముగిసింది. అయితే ఈ సువర్ణావకాశాన్ని మిస్ అయ్యామని బాధపడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ జాబ్ కోసం దరఖాస్తు గడువు తేదీని పెంచారు. భారత ప్రభుత్వానికి చెందిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేసే నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (నెస్ట్స్) ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోని పలు పోస్టుల భర్తీకి సంబంధించిన గడువు తేదీని పొడిగించింది.
ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ గత నెలలో విడుదలైంది. ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అకౌంటెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ పోస్టులను భర్తీకై దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టడం జరిగింది. జూలై 31తో ఈ గడువు ముగిసింది. అయితే ఈ గడువు తేదీని ఆగస్టు 18 వరకూ పొడిగిచారు. అర్హత కలిగిన వారు, మిస్ అయ్యామని బాధపడేవారు మరోసారి ఆగస్టు 18 లోపు ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.