రోజు రోజుకీ ప్రపంచంలో పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ఎన్నో రకాల జీవాల వాటి ఉనికి కోల్పోతున్నాయి. అరుదైన జంతు, పక్షి జాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయి.
అడవులను నాశనం చేయడం వల్ల ఎన్నో పక్షి, జంతు జాతులు దాదాపు అంతరించిపోతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న కాలుష్య కారణాలు పర్యావరణా సమతుల్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. దీంతో ఎన్నో రకాల జీవజాతులు అందరించిపోతున్నాయి. కాలుష్య ప్రభావం ఎక్కువగా పక్షులపై పడుతుందని.. దీంతో అరుదైన పక్షిజాతులు పూర్తిగా అంతరించిపోతున్నాయని ద స్టేట్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్-2020 ఒక నివేదికలో స్పష్టం చేసింది. ఇలాంటి సమయంలో ఒక పక్షికి సంబంధించిన జాడ తెలియజేస్తే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం ఆఫర్ ఇస్తున్నారు. అదేంటీ పక్షిని కనిపెడితే ప్రభుత్వ ఉద్యోగం ఏంటా అని అనుకుంటున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత దేశంలో అత్యంత అరుదైన పక్షి కలివి కోడి. వాస్తవానికి ఇది కోడి కాదు.. అరుదైన పక్షి జాతికి చెందినది. ప్రపంచంలో ఈ పక్షి జాతి దాదాపు అంతరించిపోయిందని అందరూ భావిస్తున్నారు. పక్షులపై అధ్యాయనం చేస్తున్న పరిశోధకులు ఈ పక్షి జాతి 1948 లోనే అంతరించిపోయిందని నిర్ధారించారు. 1986 లో కడప జిల్లాలో ఈ పక్షి జాడ కనిపించిందని వార్తలు రావడతో దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఈ పక్ష జాడ ఎవరైనా కనిపెడితే వారికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలిపింది. కడప జిల్లా శేషాచలం, నల్లమల అడవులు ఉన్నాయి. ఇక్కడ సిద్దవటం, బద్వేలు ఈ అటవీ ప్రాంతాన్ని లంకమల అని పిలుస్తారు. ఈ అడవుల్లో ఎన్నో రకాల జాతి పక్షులు, జంతువులు ఉన్నాయి. ఇక్కడ అడివిలో కనిపించింది కలివి కోడి.
వాస్తవానికి 1948 నాటికి ఈ పక్షి జాతి పూర్తిగా అంతరించిపోయిందని పక్షిశాస్త్ర నిపుణులు తేల్చి చెప్పారు. అనూహ్యంగా 1986 లో అట్లూరు మండలంల రెడ్డిపల్లె వాసి ఐతయ్య అనే వ్యక్తికి ఈ పక్షి కనిపించింది. దాన్ని పట్టుకొని అటవీ అధికారులకు అప్పగించారు. అది కలివికోడిగా గుర్తించారు. దీనిపై పక్షి శాస్త్రవేత్తలు అద్యాయనం చేయాలని చూసేలోపు దరదృష్టం కొద్ది ఆ పక్షి చనిపోయింది. మళ్లీ ఆ పక్షి కనిపిస్తుందని ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నారు. ఈ పక్షిని కనిపెట్టుందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తుంది. లంకమల అడవుల్లో పలుచోట్ల ప్రత్యేకమైన కెమెరాలు, కూత వినేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న మైకులు ఏర్పాటు చేశారు. కలివికోడిని గుర్తించినందుకు గాను ప్రభుత్వం ఐతయ్యను వాచర్ గా గుర్తించి అటవీశాఖలో ఉద్యోగం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ పక్షిని కనిపెట్టిన వారికి అటవీశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఆఫర్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.