ప్రభుత్వ ఉద్యోగాలకు కాంపిటీషన్ చెప్పనవసరం లేదు. పిహెచ్‌డి చేసిన వారు కూడా చిన్నఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. నోటీఫికేషన్ పడటం ఆలస్యం లక్షల్లో దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. అయినప్పటికీ వీటి కోసమే వేచి చూసే అభ్యర్థులు అనేక మంది ఉన్నారు.
దేశంలో నిరుద్యోగం రాజ్యమేలుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం విసిరి వేశారి పోతున్నారు ఆశావాహులు. ఇక ప్రైవేటు ఉద్యోగాల విషయంలో కూడా కాంపిటీషన్. ఇంజనీరింగ్ లేదా ఇతర డిగ్రీలు చదివి సాఫ్ట్ వేర్ రంగంలోకి అడుగుపెడదామని అనుకుంటే రెసిషన్ ఎప్పుడు ఎప్పుడు వస్తుందో,పోతుందో తెలియదు. ఈ రెసిషన్‌లో ఎన్ని ఉద్యోగాలైనా ఊడిపోవాల్సిందే. ఎన్ని లక్షలు సంపాదించే వాళ్లైనా ఇంటికి వెళ్లాల్సిందే. ప్రైవేటు ఉద్యోగాలు చేయాలంటే భయపడే పరిస్థితులు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు చెప్పనవసరం లేదు. పిహెచ్‌డి చేసిన వారు కూడా చిన్నఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. నోటీఫికేషన్ పడటం ఆలస్యం లక్షల్లో దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. అయినప్పటికీ వీటి కోసమే వేచి చూసే అభ్యర్థులు అనేక మంది ఉన్నారు.
శాశ్వత,కాంట్రాక్ట్, అప్రెంటిస్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అటువంటి వారికి శుభవార్త. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కాంట్రాక్టు ప్రాతిపదికన 26 లా కర్ల్ ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల లా కోర్సు (రెగ్యులర్) లేదా మూడేళ్ల లా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అలాగే నోటీఫికేషన్ జారీ చేసిన తేదీకి రెండేళ్ల ముందు ఈ డిగ్రీలు పూర్తి చేసి ఉండాలన్న నిబంధనలను గమనించాలి. ఇతర బార్ కౌన్సిల్లో అడ్వకేట్‌గా ఎన్ రోల్ చేసుకుని ఉండకూడదన్న రూల్ ఉంది. పూర్తి వివరాలు..
ఖాళీల సంఖ్య : 26
విద్యార్హతలు : ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఐదేళ్ల లా కోర్సు (రెగ్యులర్) లేదా మూడేళ్ల లా డిగ్రీ
వయో పరిమితి : 30 ఏళ్లకు మించరాదు
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ (వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకుని.. దరఖాస్తు నింపి, కింది పేర్కొన్న అడ్రసుకు పోస్టు ద్వారా పంపాలి)
దరఖాస్తు చివరి తేదీ : జులై 22.
వేతనం : రూ. 35000
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్
The Registrar (Recruitment), High Court of AP, Amaravati, Nelapadu, Guntur District, Andhra Pradesh – 522238.