పదో తరగతి పాసైన వారికి ఇదే మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. మరింకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.
పదో తరగతి పాసైన వారికి గుడ్ న్యూస్. టెన్త్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పలు ఉద్యోగాలు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,558 పోస్టుల్లో 1,198 మల్టీ టాస్కింగ్ సిబ్బంది పోస్టులు కాగా.. 360 హవల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పడవ తరగతి పాసైన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్ సీ, నాన్ మినిస్టీరియల్ విభాగంలో పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడు? వయసు పరిమితి ఎంత ఉండాలి? వంటి వివరాలు మీ కోసం.