సాఫ్ట్వేర్ జాబ్స్ అనగానే.. కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, డిగ్రీ వంటి కోర్సులు పూర్తిచేసుకొని.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలుంటేనే సాధ్యమని భావిస్తారు. కాని ఐటీ దిగ్గజ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు.. చిన్న వయసులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అదే.. హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ద్వారా.. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎంపిక చేసుకొని.. వారికి ఐటీ జాబ్స్‌కు అవసరమైన శిక్షణను అందిస్తోంది. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్‌లో పూర్తి స్థాయి ఉద్యోగ నియామకం లభిస్తుంది. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, ఫీజులు, శిక్షణ, ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.. అర్హతలు 2021/ 2022 విద్యాసంవత్సరంలో కనీసం 60శాతం మార్కులతో ఇంటర్ లేదా 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్లో మ్యాథమెటిక్స్/బిజినెస్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇంటర్/ 12వ తరగతి 2022 ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్‌సీఎల్ కెరీర్ అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌లో ప్రతిభ చూపిన వారికి పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. ఫైనల్ ఎంపిక చేస్తారు. ఎంపిక ప్రక్రియలో అభ్యర్థి వ్యక్తిత్వం, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు. ప్రోగ్రామ్ ప్రధానాంశాలు టెక్బీ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్‌లో భాగంగా క్లాస్రూమ్ ట్రెయినింగ్, ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ప్రోగ్రామ్ కాలవ్యవధి: 12 నెలలు స్టైపెండ్: రూ.10,000 పోస్టులు: ఐటీ సర్వీసెస్, అసోసియేట్లు విభాగాలు: ఐటీ, సర్వీస్ డెస్క్, బిజినెస్ ప్రాసెస్ జీతభత్యాలు: ఏడాదికి రూ.1.7లక్షలు-రూ.2.2లక్షలు శిక్షణ ఇచ్చే ప్రదేశాలు: నోయిడా, లక్నో, నాగ్‌పూర్, చెన్నై, హైదరాబాద్, మదురై, విజయవాడ. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో పూర్తికాల ఉద్యోగులుగా నియమించుకుంటారు. హెచ్‌సీఎల్‌లో పూర్తిస్థాయి ఉద్యోగం చేస్తూనే.. బిట్స్ పిలానీ, శాస్త్ర యూనివర్సిటీలో ఉన్నత విద్య కోర్సులో చేరే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్‌కు: https://registrations.hcltechbee.com ఇది కూడా చదవండి: LIC: విద్యార్థులకు శుభవార్త.. 20,000 వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం.. ఇలా అప్లై చేసుకోండి