అదేంటో తెలియదు గానీ కొందరు ప్లేయర్లకు ఏదీ కలసిరాదు. ఎంత రాణించినా సరైన అవకాశాలు దక్కవు. ఒక టీమిండియా స్టార్ ప్లేయర్ పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. ఛాన్స్ దక్కిన ప్రతిసారి తన ప్రతిభతో దుమ్మురేపుతున్నా అతడ్ని బీసీసీఐ అంతగా పట్టించుకోవడం లేదు.
మంచి ప్లేయర్లను గుర్తించడం సెలక్టర్ల పని. వారిని సానబెట్టి జాతీయ జట్టులోకి పనికి వచ్చేలా తయారు చేయాలి. నేషనల్ టీమ్‌లోకి వచ్చాక ప్లేయర్లను స్టార్లను చేయడం టీమ్ మేనేజ్మెంట్ పని. ఈ క్రమంలో తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోవాలి. అలా తమను తాము నిరూపించుకున్న వారి కెరీర్ ఎక్కువ కాలం కొనసాగుతోంది. అయితే కొందరు ప్లేయర్ల విషయంలో మాత్రం ఎందుకో తెలియదు గానీ.. బోర్డులు, సెలెక్టర్లు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆటగాళ్లు తమ టాలెంట్‌ను నిరూపించుకున్నా వారికి అవకాశాలు ఇవ్వరు. సెలక్షన్ టైమ్‌లో మొద్దు నిద్రను ప్రదర్శిస్తుంటారు. ఒక టీమిండియా స్టార్ ప్లేయర్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. అతడు ఎంతగా రాణిస్తున్నా సరైన ఛాన్సులు మాత్రం దక్కడం లేదు. ఆ ఆటగాడే యుజ్వేంద్ర చాహల్. క్రికెట్లో లెగ్ స్పిన్నర్లకు చాలా ప్రాముఖ్యత ఉంది.
కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయాలన్నా, మ్యాచ్‌ను మలుపు తిప్పాలన్నా జట్టులో ఒక లెగ్ స్పిన్నర్ ఉండాల్సిందే. చాలా జట్లు ఈ సూత్రాన్ని పాటిస్తుంటాయి. మంచి లెగ్ స్పిన్నర్లు దొరికితే వారిని స్టార్లుగా తీర్చిదిద్దుతాయి. టీమిండియాకు దొరికిన అలాంటి ఒక అరుదైన లెగ్ స్పిన్ బౌలరే యుజ్వేంద్ర చాహల్. అతడి స్పిన్ ప్రతిభను గుర్తించి భారత జట్టులోకి చోటిచ్చారు సెలెక్టర్లు. చాహల్ కూడా తనను తాను నిరూపించుకున్నాడు. చూడ్డానికి బక్కపలచగా ఉండే చాహల్.. బాల్ వేశాడా ఎంతటి బ్యాట్స్‌మెన్‌కైనా ఎదుర్కోవడం కష్టమే. గూగ్లీలతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడంలో చాహల్ సిద్ధహస్తుడు. వైవిధ్యమైన బాల్స్‌తో బ్యాట్స్‌మెన్ తన వలలో చిక్కేలా చేస్తాడు చాహల్. మ్యాచ్ చేజారుతుందనుకున్న ప్రతిసారి వికెట్లు తీస్తూ టీమిండియాలో కీలక పాత్ర పోషించాడు. భారత జట్టు తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు (91) తీసింది కూడా చాహలే. ఇంత బాగా ఆడుతున్నా ఎందుకో బీసీసీఐ అతడ్ని పట్టించుకోవడం లేదు.
గత కొంతకాలంగా చూసుకుంటే.. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ల్లో చాహల్ జట్టులోనే ఉన్నా అతడికి ఛాన్సులు ఇవ్వలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన ఓడీఐ సిరీస్‌లో కేవలం ఒక వన్డేలో మాత్రమే ఆడే అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఐపీఎల్లో 21 వికెట్లతో చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తంగా 143 మ్యాచుల్లో 187 వికెట్లతో టాప్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. గురువారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు. ఇంతగా రాణిస్తున్నా చాహల్‌ను బీసీసీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు, అతడ్ని టీమ్‌లో పెట్టుకుని ఏం చేస్తున్నట్లు అని క్రికెట్ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మరి.. అద్భుతమైన బౌలింగ్‌తో అదరగొడుతున్న చాహల్‌ను బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్ పట్టించుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yuzvendra Chahal has been a star in T20 cricket ✨
📸: IPL/BCCI#IPL2023 #KKRvsRR #CriTracker pic.twitter.com/n7fLslgAgI
— CricTracker (@Cricketracker) May 11, 2023