భారత మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో చెన్నై మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉన్న గత రికార్డు కనుమరుగైంది.
భారత మిస్టరీ స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరుగుతోన్న మ్యాచులో నితీశ్ రాణా వికెట్ తీయడం ద్వారా చాహల్ ఈ ఘనత అందుకున్నాడు. ఇది అతనికి 184వ వికెట్ కావడం గమనార్హం. అంతకుముందు చెన్నై మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో 183 వికెట్లతో అగ్రస్థానంలో ఉండేవాడు.
ఐపీఎల్ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చాహల్(187), బ్రావో(183) తొలి రెండు స్థానాల్లో ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో పియూష్ చావ్లా(174), అమిత్ మిశ్రా(172), రవిచంద్రన్ అశ్విన్(171) ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ చేపట్టిన నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 149 పరుగులకే పరిమితమైంది. వెంకటేష్ అయ్యర్(57) ఒక్కడే రాణించాడు. అతనికి తోటి ఆటగాళ్ల నుంచి సహకారమే లభించలేదు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీసుకోగా, బోల్ట్ 2, సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. కాగా, ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డూమ్యాచ్. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచులో తప్పక గెలవాలి.
Milestone 🚨 – Yuzvendra Chahal becomes the leading wicket-taker in IPL 👏👏#TATAIPL | @yuzi_chahal pic.twitter.com/d70pnuq6Wi
— IndianPremierLeague (@IPL) May 11, 2023
Yuzvendra Chahal surpasses Dwayne Bravo to become the new leading wicket-taker in IPL.
📸: Jio Cinema#IPL2023 | @DJBravo47 | @yuzi_chahal pic.twitter.com/tPr9kwx759
— CricTracker (@Cricketracker) May 11, 2023