Rohit Sharma: చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓటమి తర్వాత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లను ఉద్దేశించి ఓపెనర్ వార్నింగ్ ఇచ్చాడు.
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమి చవిచూసిన రోహిత్ సేన.. తాజాగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ సీజన్లో ఇప్పటి వరకు ఖాతా తెరవని జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తరసన ముంబై ఇండియన్స్ కూడా చేరింది. ఈ మూడు జట్లు మినహా మిగతా జట్ల ఖాతాల్లో కనీసం ఒక్కో విజయమైనా ఉంది. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 21 పరుగులతో మంచి టచ్‌లో కనిపించినా.. యువ బౌలర్ తుషార్ దేశ్‌పాండే అద్భుతమైన డెలవరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 32 పరుగులతో పర్వాలేదనిపించాడు.
చివర్లో టిమ్ డేవిడ్ 32 పరుగుల చేసి రాణించాడు. వరుసగా 6, 4, 6 కొట్టి ఊపులో కనిపించినా.. ఆ వెంటనే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. వీరు ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. రూ.17 కోట్ల ధర పలికిన కామెరున్ గ్రీన్ కేవలం 12, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ఒక్క పరుగు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచారు. దీంతో ముంబై 157 పరుగులకే పరిమితమైంది. ఇప్పటికే వీక్‌గా ఉన్న ముంబై బౌలింగ్ జోఫ్రా ఆర్చర్ లేకపోవడంతో మరింత బలహీనపడింది. ఈ వీక్ బౌలింగ్ ఎటాక్‌పై చెన్నై బ్యాటర్లు ఎదురుదాడికి దిగి.. మంచి ఫలితం రాబట్టారు. ఓపెనర్ కావ్వె వికెట్‌ను త్వరగానే కోల్పోయినా.. చెన్నై తడబడలేదు.
భారత వెటరన్ క్రికెటర్ అజింక్యా రహానే విధ్వంస సృష్టించాడు. 7 ఫోర్లు, 3 సిక్సులతో తన శైలికి పూర్తి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి.. ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం మీద 27 బంతుల్లో 61 పరుగులు చేసి.. అదరగొట్టాడు. ఇక ఈ ఓటమి తర్వాత మాట్లాడిన రోహిత్ శర్మ.. తమ టీమ్ మిడిల్డార్ వైఫల్యం వల్ల 30-40 పరుగులు తక్కువ చేశామని అదే తమ ఓటమికి కారణంగా నిలిచిందని అన్నాడు. అలాగే జట్టులోని సీనియర్ ఆటగాళ్లు తనతో సహా అంతా సెట్ కావాలని అన్నాడు. ఈ కామెంట్‌తో రోహిత్ శర్మ ఇన్‌డైరెక్ట్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు వార్నింగ్ ఇచ్చాడంటూ క్రికెట్ అభిమానులు భావిస్తున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో ముంబై ఓటమి, రోహిత్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bounce Back Rohit Sharma!🎯#IPL2023 #MIvCSK pic.twitter.com/qK8eLzBbf4
— RVCJ Media (@RVCJ_FB) April 9, 2023