Virat Kohli, Gautam Gambhir: గంభీర్-కోహ్లీ ఇద్దరు ఢిల్లీకి చెందిన ప్లేయర్లే కానీ.. ఇద్దరికీ అస్సలు పడదనే ప్రచారం ఉంది. ఐపీఎల్‌లో ఒకసారి వీరిద్దరి మధ్య గొడవ కూడా చోటు చేసుకుంది. తాజాగా ఆర్సీబీపై లక్నో విజయం సాధించిన తర్వాత గంభీర్ చేసిన పని కోహ్లీ ఫ్యాన్స్‌కు మండిపోయేలా చేసింది.
మ్యాచ్ గెలిస్తే సంతోషంతో సంబరాలు చేసుకోవడం సహజం. కానీ ఆ గెలుపు ఓడిపోయే మ్యాచ్‌లో వస్తే.. ఆ ఆనందానికి హద్దులే ఉండవు. ఈ సమయంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం సామాన్యమైన విషయం కాదు. దీంతో కొంతమంది సంతోషాన్ని తట్టుకోలేక అత్యుత్సాహం ప్రదర్శిస్తారు. ఈ క్రమంలో వీరి ఓవర్ యాటిట్యూడ్ ప్రత్యర్థి జట్టుకి ఇబ్బందిని కలిగిస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటన నిన్న ఐపీఎల్‌లో ఒకటి చోటు చేసుకుంది. టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ తన ఓవర్ యాక్షన్ తో బెంగళూరు అభిమానులకి టార్గెట్ అయ్యాడు. అసలు గంభీర్ ఏం చేసాడంటే ?
ఐపీఎల్‌లో నిన్న బెంగళూరు, లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. చివరి వరకు హోరా హోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో లక్నో.. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కొట్టాల్సిన రన్ రేట్ దాదాపు 13గా ఉండడంతో ఈ మ్యాచ్ ఏకపక్షమే అని భావించారంతా. దీంతో ఆర్సీబీ అభిమానులు చిన్నస్వామి స్టేడియంలో సందడి చేస్తూ కనిపించారు. కానీ స్టోయినీస్, పూరన్ ఊహించని విధంగా చెలరేగి లక్నోని విజయం వైపుకి మళ్లించారు. ఇక చివర్లో పూరన్ ఔటవ్వడంతో.. నువ్వా నేనా అన్నట్లుగా ఈ మ్యాచ్ సాగింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్ చివరి బంతికి లక్నో విజయం సాధించడంతో.. ఆ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఈ దశలో సంతోషాన్ని ఆపుకోలేకపోయిన గంభీర్ ఆర్సీబీని ఎంకరేజ్ చేస్తున్న ఫ్యాన్స్‌ని ఉద్దేశించి “ఇక ఆపండి అని నోటి మీద వేలుని ఉంచి సైగ చేసాడు. అసలే నిరాశగా ఉన్న ఆర్సీబీ అభిమానుల్లో గంభీర్ రియాక్షన్ కోపం తెప్పించింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారుతుంది. దీంతో ఇప్పుడు బెంగళూరు అభిమానులు గంభీర్ మీద ట్రోల్స్ దిగారు. “గంభీర్‌ని స్థాయికి తగ్గట్టు హుందాగా ప్రవర్తించు. ఒక్క విజయం. అది కూడా చివర్లో బైస్ రూపంలో వచ్చింది. దానికి ఇంతలా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం అవసరమా? తదుపరి మ్యాచ్‌లో కోహ్లీ ఇచ్చే రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉండూ”. అని గంభీర్ మీద కోహ్లీ అభిమానుల మీద విరుచుకుపడుతున్నారు. ఒకప్పుడు గంభీర్, కోహ్లీ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. 2013లో వీరిద్దరూ వారి వారి జట్లకు కెప్టెన్ గా ఉన్న సమయంలో కోహ్లీ.. గంభీర్ చేతిలో స్లెడ్జింగ్ కి గురయ్యాడు. ఇటీవలే కోహ్లీ వరుస సెంచరీలు చేస్తున్న నేపథ్యంలో అందరూ.. సచిన్ రికార్డ్ బద్దలు కొట్టడం కోహ్లీకే సాధ్యం అని అనుకుంటున్న తరుణంలో.. గంభీర్ ఈ విషయంపై మాట్లాడుతూ “సచిన్ తో కోహ్లీని పోల్చలేం. అప్పట్లో సచిన్ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కున్నాడు. కానీ ఇప్పుడు కోహ్లీకి అలా లేదు” అని కోహ్లీని తక్కువ చేసేవిధంగా మాట్లాడాడు. ఇలా అందరిని టార్గెట్ చేస్తూ వివాదాల్లో చిక్కుకునే గంభీర్ ఈ సారి ఆర్సీబీ అభిమానులని హర్ట్ చేసాడు. మరి ఆర్సీబీ అభిమానులని ఉద్దేశించి గంభీర్ ఇచ్చిన ఈ రియాక్షన్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
Gautam Gambhir to the Chinnaswamy crowd after the match. pic.twitter.com/Uuf6Pd1oqw
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2023