ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారుతున్నాడు. ఈ ఐపీఎల్ లో ఒక్క అర్ధ సెంచరీ మినహా మిగిలిన మ్యాచులన్నిటిలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు.ఇదిలా ఉండగా ఇప్పుడు రోహిత్ శర్మకి మరొక కొత్త సమస్య వచ్చి చేరినట్లుగానే కనిపిస్తుంది.
ఐపీఎల్ లో నేడు మరో కీలక సమరానికి తెరలేవనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా జరగనున్న నేటి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ , ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ఇరు జట్లు టాప్ 4 లో ఉన్నపటికీ ప్లే ఆఫ్ బెర్త్ ఇంకా కంఫర్మ్ కాలేదు. ఈ నేపథ్యంలో రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. గుజరాత్ ఇప్పటికే 11 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి అగ్ర స్థానంలో నిలవగా..ఈ మ్యాచ్ గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్ బెర్త్ కంఫర్మ్ చేసుకుంటుంది. ఇక ముంబై 11 మ్యాచుల్లో 6 విజయాలతో నాలుగో స్థానంలో నిలిచిన ముంబై.. ఈ మ్యాచ్ గెలిస్తే 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కి దగ్గరలో ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచులో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకి రషీద్ ఖాన్ తలనొప్పిగా మారాడు.
ఐపీఎల్ లో రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. వరుసగా విఫలమవుతూ జట్టుకి భారంగా మారుతున్నాడు. ఈ ఐపీఎల్ లో ఒక్క అర్ధ సెంచరీ మినహా మిగిలిన మ్యాచులన్నిటిలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఇక చివరిగా 5 ఇన్నింగ్స్ లు చూసుకున్నట్లైతే అన్ని సింగిల్ డిజిట్ లే కావడం గమనార్హం. వీటిలో రెండు సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు. ప్లే ఆఫ్ కోసం ప్రతి మ్యాచులో తప్పకుండా గెలవాల్సిన మ్యాచులో రోహిత్ ఫామ్ ముంబై ఇండియన్స్ ని ఆందోళనకి గురి చేస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు రోహిత్ దగ్గరకు మరొక కొత్త సమస్య వచ్చి చేరినట్లుగానే కనిపిస్తుంది. అదేంటో కాదు ఆఫ్ఘనిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ బౌలింగ్.
రషీద్ ఖాన్ గొప్ప బౌలర్ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆఫ్ఘానిస్తాన్ స్పిన్నర్ మీద రోహిత్ శర్మకి చాలా చెత్త రికార్డ్ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రషీద్ ఖాన్ బౌలింగ్ లో 21 బంతులు ఆడిన హిట్ మ్యాన్.. కేవలం 23 పరుగులు మాత్రమే చేసాడు. స్ట్రైక్ రేట్ 109 మాత్రమే ఉండగా.. 3 సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. యావరేజ్ 7 మాత్రమే ఉంది. అసలే ఫామ్ లో లేని రోహిత్ శర్మకి ఇప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్ సవాలుగా మారింది. మరి ఎప్పటిలాగే వికెట్ ఇస్తాడో లేకపోతే ఈ సారి డామినేట్ చేస్తాడో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.