ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ కు గాయమైంది. అందుకే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉపయోగించి కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు. అదే టైంలో అతడి గాయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
క్రికెటర్లకు ఫిట్ నెస్ కంపల్సరీ. అలా అయితేనే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్టింగ్ చేయగలరు. ఏ చిన్న గాయమైనా సరే మ్యాచ్ లో ఆడరు. ఒకవేళ ఇంకా పెద్ద గాయమైతే పూర్తి సిరీస్ లేదా టోర్నీకి దూరమవుతూ ఉంటారు. ఇలాంటి రీజన్స్ వల్లే ఈసారి ఐపీఎల్ కు దాదాపు 10-15 మంది కంటే ఎక్కువమంది ప్లేయర్లు దూరమయ్యారు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ కూడా ఇలానే గాయంతో బాధపడుతున్నారు. మొన్నీ మధ్య అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. కానీ ఇప్పుడు ఆ గాయంపై సందేహాలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరుగుతోంది?
అసలు విషయానికొస్తే.. చాలామంది క్రికెటర్లకు డెడికేషన్ ఉంటుంది. ఎంతలా అంటే గాయమైనా, రక్తం కారుతున్నా సరే మ్యాచులు ఆడేస్తుంటారు. అద్భుతమైన బ్యాటింగ్ చేస్తుంటారు. మహా అయితే ఒకటో రెండో మ్యాచుల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. తాజాగా జరుగుతున్న ఐపీఎల్ లోనూ డుప్లెసిస్ అలా గాయంతో ఆడేస్తున్నాడు. కొన్నాళ్ల ముందు ఓ మ్యాచ్ సందర్భంగా డైవ్ చేస్తుండగా కుడివైపు రిబ్(ఉపిరితిత్తులు) దగ్గర నొప్పి వచ్చిందని డుప్లెసిస్ చెప్పాడు. అందుకే పంజాబ్ తో జరిగిన గత మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి బ్యాటింగ్ మాత్రమే చేశాడు. 56 బంతుల్లో 84 రన్స్ కొట్టి ఆకట్టుకున్నాడు. ఆ మ్యాచులో బెంగళూరు గెలిచేసింది.
తాజాగా రాజస్థాన్ తో మ్యాచులోనూ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన డుప్లెసిస్.. 39 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా రాబోయే కొన్ని మ్యాచులకు కూడా కెప్టెన్సీ చేస్తానని అన్నాడు. అంటే ఆర్సీబీ నెక్స్ట్ కొన్ని మ్యాచుల్లోనూ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం పక్కా అనిపిస్తుంది. మరోవైపు డుప్లెసిస్ కు గాయమైందని అంటున్నారు. కానీ అంతంతసేపు ఎలా బ్యాటింగ్ ఎలా చేస్తున్నాడా అని నెటిజన్స్ సందేహ పడుతున్నారు. ఇంతకీ గాయం కావడం నిజమా? అబద్ధమా? అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచులాడిన డుప్లెసిస్.. 405 రన్స్ కొట్టాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరి డుప్లెసిస్ గాయంతో బ్యాటింగ్ చేస్తుండటం, ఆరెంజ్ క్యాప్ దక్కించుకోవడంపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
– 73(43) vs MI
– 23(12) vs KKR
– 79*(46) vs LSG
– 22(16) vs DC
– 62(33) vs CSK
– 84(56) vs PBKS
– 62(39) vs RR5 fifties from 7 innings in IPL 2023, Faf Du Plessis leading by example at the age of 38. pic.twitter.com/HKwKRyV6Kq
— Johns. (@CricCrazyJohns) April 23, 2023