ఈ ఏడాది ఐపీఎల్లో సత్తా చాటిన బౌలర్లలో వెటరన్ పేసర్ మోహిత్ శర్మ ఒకడు. ఈ టీమిండియా స్పీడ్‌స్టర్ స్లో బాల్, యార్కర్లు, కట్టర్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెట్టాడు. అయితే ఇంతగా రాణించిన మోహిత్.. కీలకమైన ఫైనల్లో మాత్రం ఫెయిలయ్యాడు.
గతేడాది ఐపీఎల్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈసారి కూడా లీగ్‌లో తన డామినేషన్‌ను కొనసాగించింది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే ప్లేఆఫ్స్‌లో ఆ జట్టు పప్పులు ఉడకలేదు. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో గుజరాత్ ఓడిపోయింది. దీంతో క్వాలిఫయర్-2 ఆడాల్సి వచ్చింది. సీఎస్కే చేతుల్లో అనూహ్యంగా పరాజయం పాలైనప్పటికీ తేరుకున్న హార్దిక్ సేన.. క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై నెగ్గి ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఫైనల్ ఫైట్‌లో సీఎస్కే చేతిలో మరో ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోయింది గుజరాత్ . మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు గేమ్‌లో నిలిచిన హార్దిక్ టీమ్.. చివరి రెండు బాల్స్‌లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. అప్పటివరకు ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేసిన సీనియర్ పేసర్ మోహిత్ శర్మ.. క్రీజులో ఉన్న రవీంద్ర జడేజాను కట్టడి చేయడంలో ఫెయిల్ అయ్యాడు.
మోహిత్ శర్మ వేసిన ఆఖరి రెండు బాల్స్‌ను ఫోర్, సిక్స్‌గా మలచి చెన్నైకి మైమరచిపోని విజయంతో పాటు టైటిల్‌ను అందించాడు జడేజా. అయితే జడ్డూ దెబ్బకు మోహిత్ శర్మకు ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదట. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించాడు. ‘ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నేను వినూత్నంగా ఏదైనా చేసుంటే మా జట్టు గెలిచి ఉండేదా అని ఆలోచిస్తూ ఉండిపోయా. ఆ బాల్ వేయాల్సిందా? లేదా ఈ బాల్ వేయాల్సిందా అంటూ ఆలోచించా. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. కానీ దీని నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ ఐపీఎల్లో ఫోకస్డ్గా ఉంటూ నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ఆడా. ఈ క్రమంలో సక్సెస్ కూడా అయ్యా. అయితే ఫైనల్లో జడేజాకు యార్కర్లు వేయాలని చూశా. కానీ అది వర్కౌట్ కాలేదు. నేను అనుకున్న చోట బాల్ పడలేదు. దీన్ని వినియోగించుకున్న జడేజా తాను వచ్చిన పని ఫినిష్ చేశాడు’ అని మోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
A Mohit Sharma appreciation post 💙
For a terrific comeback season, the three wickets in the final, the first four balls of the last over 🫡#CSKvsGT #MohitSharma #CricketTwitter pic.twitter.com/GwXmcoYwqe
— Cricbuzz (@cricbuzz) May 30, 2023