ఐపీఎల్ 2023 సీజన్ లో రోజుకో రికార్డు బద్దలు అవుతూ ఉంది. తాజాగా జరిగిన పంజాబ్-గుజరాత్ మ్యాచ్ లో కూడా ఓ రికార్డు క్రియేట్ చేశాడు పంజాబ్ పేసర్ కగిసో రబాడా. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్రకెక్కాడు.
IPL 2023 సీజన్ ప్రారంభం అయ్యింది. ఇక ఈ సీజన్ లో తొలి మ్యాచ్ నుంచే అభిమానులను అలరిస్తోంది ఈ మెగా ఈవెంట్. నరాలుతెగే ఉత్కంఠతతో జరుగుతున్నాయి ఐపీఎల్ మ్యాచ్ లు. ఇక రోజుకో రికార్డు బ్రేక్ కావడం.. కొత్త రికార్డులు లిఖించడం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం పంజాబ్-గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఓ అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఈ రికార్డును పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ కగిసో రబాడా సృష్టించాడు. ఈ క్రమంలోనే శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగా, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ లను దాటుకుని ఈ ఫీట్ సాధించాడు. ఈ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కగిసో రబాడా.. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, బుల్లెట్ వేగంతో బంతులు విసరడంలో సిద్దహస్తుడు రబాడా. ఇతడి వేగం చూస్తే.. బ్యాటర్లకు ఒకపక్క వణుకు పుట్టుడం ఖాయం. అతలా అతడు తన స్పీడ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతుంటాడు. ఇక తాజాగా జరుగుతున్న ఐపీఎల్ 2023 టోర్నీలో తొలి మ్యాచ్ ఆడాడు రబాడా. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ ఓపెనర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్ లో అరుదైన ఘనతను సాధించాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో అతి తక్కువ మ్యాచ్ ల్లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు రబాడా. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్ గా చరిత్రకెక్కాడు.
ఇక ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న మలింగా రికార్డును బద్దలు కొట్టాడు రబాడా. మలింగా 70 మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించగా.. రబాడా కేవలం 64 మ్యాచ్ ల్లోనే ఈ ఫీట్ ను సాధించాడు. ఇక ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(81 మ్యాచ్ లు), రషీద్ ఖాన్ (82), అమిత్ మిశ్రా (83) మ్యాచ్ ల్లో ఈ ఘనత సాధించారు. ఇక రబాడా 100 వికెట్లు తీయడానికి 1438 బంతులు విసిరితే.. మలింగ 1622 బంతులు తీసుకున్నాడు. మరి రబాడా ఈ అద్భుతమైన రికార్డును నెలకొల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
𝐴𝑎𝑡𝑒 ℎ𝑖 𝑑𝑖𝑙 𝑘ℎ𝑢𝑠ℎ 𝑘𝑎𝑟 𝑑𝑖𝑡𝑡𝑎, Rabada veere! 🙌
Kagiso Rabada is 🔙 with pace 🔥 as he brings up a 💯 wickets in #TATAIPL✨#PBKSvGT #IPLonJioCinema #IPL2023 | @KagisoRabada25 @PunjabKingsIPL pic.twitter.com/vnXHyt3quI
— JioCinema (@JioCinema) April 13, 2023