రోహిత్ అభిమానులకు బిగ్ అలర్ట్ అందుతోంది. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్ మ్యాన్ బరిలోకి దిగలేదు. ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్‌కు కడుపులో బాగలేదట. ఇన్‌ఫెక్షన్ రావడంతో అతను ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు చేపట్టాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు రెండు కీలక మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనుండగా, రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు.. గుజరాత్ టైటాన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇదిలావుంటే వాంఖాడే వేదికగా జరుగుతోన్న తొలి మ్యాచ్‌కు ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ దూరమయ్యాడు. రోహిత్‌కు కడుపులో బాగలేదట. ఇన్‌ఫెక్షన్ రావడంతో అతను ఆడటం లేదని తెలుస్తోంది. దీంతో సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు పగ్గాలు అందించారు.
రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ టాస్‌కు హాజరయ్యాడు. ఈ క్రమంలో అభిమానులు కంగారుపడగా రోహిత్ ఆరోగ్యం బాగోలేదని అందుకే సూర్య వచ్చాడని కామెంటర్ డువాన్ జాన్సెన్ వివరించాడు. ఒకవేళ మ్యాచ్ మధ్యలో రోహిత్ కోలుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఎంట్రీ ఇచ్చాడు. గత రెండు సీజన్లలో బెంచ్‌కే పరిమితమైన సచిన్ తనయుడికి ఎట్టకేలకు మూడో సీజన్‌లో ఆడే అవకాశం లభించింది. ఇక ప్రస్తుత సీజన్ లోనూ ముంబైకి ఏమాత్రం కలిసి రావడం లేదు. ఇప్పటి వరకూ 3 మ్యాచ్‌లు ఆడగా, ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.
” @ImRo45 (Rohit Sharma) is out, he has a stomach bug” – says MI’s stand-in captain @surya_14kumar during the toss
FOLLOW LIVE: https://t.co/Bb4ygZ7QkE pic.twitter.com/zBSqFtKIhM
— TOI Sports (@toisports) April 16, 2023
Reason for rohit sharma’s stomach bug😭pic.twitter.com/bSud4l4EmH
— M. (@IconicKohIi) April 16, 2023