హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ అనారోగ్యం బారిన పడ్డాడు. చెపాక్ వేదికగా చెన్నైతో మ్యాచుకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అతని స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి వచ్చాడు.
ముంబై యువ క్రికెటర్, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అనారోగ్యం బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ వెల్లడించాడు. చెపాక్ వేదికగా చెన్నైతో మ్యాచుకు ముందు ఇది చోటుచేసుకుంది. టాస్ సమయంలో తిలక్ అనారోగ్యానికి గురయ్యాడని చెప్పిన రోహిత్, అతని స్థానంలో యువ క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్ జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు. అయితే తిలక్ వర్మకు అనారోగ్యం అన్నప్పటికీ. .అతనికి ఏమైంది..? అన్నది చెప్పకపోవడం అభిమానులను కలవర పెడుతోంది. ప్రస్తుతం ముంబై జట్టులో నిలకడగా రాణిస్తున్న ఏకైక క్రికెటర్.. తిలక్ వర్మనే. అలాంటిది అతడు రాబోవు మ్యాచులకు దూరమైతే ముంబైకి పెద్ద లోటే అని చెప్పుకోవాలి.
ఇదిలావుంటే.. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన ధోని బౌలింగ్ ఎంచుకున్నారు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదే సీజన్ లో ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా జరిగిన పోరులో చెన్నై పైచేయి సాధించింది. అందుకు బదులుగా ముంబై ఈ మ్యాచులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన చెన్నై ఐదు మ్యాచులలో విజయం సాధించి 11 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచులో గెలిస్తే టాప్ -2 కు చేరుతుంది. మరోవైపు.. ముంబై 9 మ్యాచుల్లో ఐదింట గెలిచి 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో భారీ విజయం అందుకుంటే ముంబై ఆర్సీబీతో పాటు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ను కూడా అధిగమించి టాప్ -2 జట్టుగా ఉండే అవకాశాలున్నాయి.
📃Here are the playing XIs of #CSKvMI match.
Tilak Varma is ill, he’s replaced by Tristan Stubbs. Meanwhile, CSK are unchanged. #CSKvsMI #IPL2023 #TATAIPL2023 #ElClasico pic.twitter.com/MMF1EMLreh
— Sportz Point (@sportz_point) May 6, 2023
“Tilak Varma ils ill”
Okadu thaggadu pic.twitter.com/cwdwtpEKqn
— 7⃣#Yellove (@Cherrybunny0828) May 6, 2023