ఐపీఎల్-2023 ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన అభిమానులకు వాతావరణం నిరాశపర్చింది. ఫైనల్ ఫైట్‌కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు.
కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురవడంతో.. ఆదివారం రాత్రి జరగాల్సిన మ్యాచ్ మరుసటి రోజుకు పోస్ట్‌పోన్ అయింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్. ఒక్కసారిగా మొదలైన వర్షం, మధ్యలో కాసేపు ఆగినా.. మళ్లీ చినుకులు జోరందుకోవడంతో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన తుదిపోరును వాయిదా వేయక తప్పలేదు. ఇరు జట్ల కోచ్‌లు ఆశిష్ నెహ్రా, స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత మ్యాచ్‌ను అధికారులు పోస్ట్‌పోన్ చేయాలని నిర్ణయించారు. అంతకుముందే పిచ్, మైదానంలోని పరిస్థితిపై గ్రౌండ్స్‌మెన్‌తో అధికారులు సంప్రదింపులు జరిపారు.
గుజరాత్, చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం టికెట్లు కొనుగోలు చేసిన వారిని సోమవారం కూడా స్టేడియంలోకి అనుమతిస్తారు. అయితే ఇవాళ కూడా ఫైనల్ ఫైట్ జరగడం అనుమానంగానే ఉంది. సోమవారం కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. అప్పుడు గుజరాత్ టైటాన్స్ టీమ్‌ను విన్నర్‌గా ప్రకటిస్తారు. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఫస్ట్ ప్లేస్‌లో నిలవడమే అందుకు కారణం. సూపర్ ఓవర్‌కు నిర్వహణ సాధ్యమైతే దాంతో విజేత ఎవరో తేలుస్తారు. అది కూడా కుదరకపోతే గుజరాత్‌నే విన్నర్‌గా ప్రకటిస్తారు. ఇక, అహ్మదాబాద్‌లో సోమవారం సాయంత్రం వాతావరణం మేఘావృతమై ఉంటుందని.. గంటకు సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెదర్ డాట్ కామ్ తెలిపింది. అయితే రాత్రి ఫైనల్ మ్యాచ్ మాత్రం సజావుగా సాగే అవకాశాలు ఉన్నాయని శుభవార్త చెప్పింది
Super Over will determine IPL 2023 Winner if the match is not possible even today.
– If Super Over is not also possible, Gujarat Titans will win IPL 2023. pic.twitter.com/lb2WF6pdTe
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 28, 2023