రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో అశ్విన్ చేసిన ఒక పనికి నెటిజన్స్ అతడ్ని టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. అసలేం జరిగిందంటే..!
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతం చేసి చూపించింది. రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో బంపరీ విక్టరీ కొట్టి తమ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన ఆర్సీబీ.. కీలకమైన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఫస్ట్ ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. ‘కేజీఎఫ్’ త్రయంలో కోహ్లీ (18) ఫర్వాలేదనిపించినా.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (54), ఫాఫ్ డుప్లెసిస్ (55) బాగా రాణించారు. ముఖ్యంగా మ్యాక్సీ రాజస్థాన్ బౌలర్లపై హార్డ్ హిట్టింగ్‌కు దిగాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో కీపర్ అనూజ్ రావత్ (29) కూడా మెరుపు బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోరును అందించాడు.
ఆ తర్వాత ఛేదనకు దిగిన రాజస్థాన్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఆర్సీబీ పేసర్లు వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్‌లకు తోడుగా స్పిన్నర్లు బ్రేస్‌వెల్, కర్ణ్‌శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వీరి దెబ్బకు రాజస్థాన్ జట్టు 59 రన్స్‌కే ఆలౌట్ అయింది. ఆ టీమ్ ఏ దశలోనూ ఛేదన దిశగా సాగుతున్నట్లు కనిపించలేదు. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు ఔటై పెవిలియన్ వైపు సాగారు. ఒక్క హెట్మెయిర్ (35) మాత్రమే రాణించాడు. అతడు కూడా భారీ షాట్లు కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔటై వెనుదిరిగాడు. ఇకపోతే, ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ రనౌట్ అవడం చర్చనీయాంశంగా మారింది.
హెట్మెయిర్ కొట్టిన బాల్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ చేతుల్లోకి వెళ్లింది. అయితే డబుల్ తీయాలని హెట్మెయిర్ అనుకున్నాడు. దీంతో అశ్విన్ రెండో రన్‌కు ప్రయత్నించాడు. కానీ హెట్మెయిర్ వద్దనడంతో తిరిగి వెనక్కి వచ్చాడు. కానీ తిరిగి క్రీజులోకి చేరుకునే లోపే ఆర్సీబీ కీపర్ అనూజ్ రావత్ అతడ్ని అద్భుతంగా రనౌట్ చేశాడు. సిరాజ్ విసిరిన త్రోను పిక్ చేసుకున్న అనూజ్.. ధోని స్టైల్లో అశ్విన్‌ను రనౌట్ చేశాడు. అశ్విన్ లేజీ రన్నింగ్‌తో రనౌట్ అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఒకసారి మన్కడింగ్ చేసిన అశ్విన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మన్కడింగ్ చేయడం చేతనవుతుంది గానీ పరిగెత్తడం మాత్రం అశ్విన్‌కు అస్సలు చేతగాదని ట్రోల్ చేస్తున్నారు. మన్కడ్ కింగ్ డౌన్ అంటూ అతడు రనౌట్ అయిన వీడియోను వైరల్ చేస్తున్నారు. మరి.. దీనిపై అశ్విన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
The Anuj Rawat direct-hit that left everyone in disbelief 🔥🔥
Check out the dismissal here 🔽 #TATAIPL | #RRvRCB pic.twitter.com/2GWC5P0nYP
— IndianPremierLeague (@IPL) May 14, 2023