ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ ఎంత ఫన్నీగా ఉంటాడో తెలిసిందే. ఆటలో సీరియస్‌గా ఉన్నా అవకాశం దొరికినప్పుడల్లా అందరితో సరదాగా ఉంటాడు.
ఐపీఎల్-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏదీ కలసిరావడం లేదు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లోనూ ఆ జట్టు ఘోరంగా విఫలమవుతోంది. రిషబ్ పంత్ లేకపోవడం ఆ టీమ్ బ్యాటింగ్ లైనప్‌లో పెద్ద లోటుగా కనిపిస్తోంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాణిస్తున్నా.. అది టీమ్ గెలిచేందుకు సరిపోవడం లేదు. దీంతో కోచ్ పాంటింగ్ ప్లేయర్లకు స్ట్రాంగ్ క్లాస్ పీకాడు. రాణిస్తేనే జట్టులో ఉంటారంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు. మొత్తానికి అది పనికొచ్చింది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆరో మ్యాచ్‌లో గెలిచింది. అయితే సక్సెస్ జోష్‌లో ఉన్న వార్నర్ సేన.. సోమవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో అదే ఊపును ప్రదర్శించడంలో ఫెయిల్ అయింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 144 రన్స్ మాత్రమే చేయగలిగింది.
సన్‌రైజర్స్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 3 కీలకమైన వికెట్లతో ప్రత్యర్థి వెన్ను విరిచాడు. ఇకపోతే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ పేసర్ భువనేశ్వర్ కుమార్ల మధ్య జరిగిన సంఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. టాస్ వేసుకున్న తర్వాత వార్నర్ నేరుగా భువనేశ్వర్ దగ్గరకు వెళ్లాడు. అతడి కాళ్ల మీద పడ్డాడు. దీంతో భువీతో పాటు అందరూ షాక్ అయ్యారు. అయితే తేరుకున్న భువనేశ్వర్ వార్నర్‌ను పైకి లేపి కౌగిలించుకున్నాడు. అతడు ఎందుకిలా చేశాడనేది తెలియకున్నా ఈ ఘటన వీళ్లిద్దరి స్నేహాన్ని మరోసారి నిరూపించిందని చెప్పొచ్చు. కొన్నేళ్ల పాటు సన్‌రైజర్స్ తరఫున ఆడిన వార్నర్‌కు భువీతో మంచి అనుబంధం ఉంది. గ్రౌండ్ లోపలే కాకుండా బయట కూడా మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్కు, అలాగే వార్నర్ ఎంత సరదాగా ఉండటాడో అనే దానికి ఇది ఉదాహరణ అని వాళ్ల ఫ్యాన్స్ అంటున్నారు.
This visual is all 🧡 💙!
Follow the match ▶️ https://t.co/ia1GLIWu00#TATAIPL | #SRHvDC | @SunRisers | @DelhiCapitals | @BhuviOfficial | @davidwarner31 pic.twitter.com/t9nZ95dyJ7
— IndianPremierLeague (@IPL) April 24, 2023