ఐపీఎల్ 2022 సీజన్ ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వరుస విజయాలతో చెలరేగిన జట్టు ఓటముల బాట పడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. వరుసగా నాలుగో ఓటమిని నమోదు చేసి ఫ్యాన్స్ కు షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుపై బెంగళూరు 67 పరుగులు తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు డుప్లెసిస్(73*), రజత్(48), ధినేష్ కార్తిక్(30*) చెలరేగండంతో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు నమోదు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 19.2 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ గా వెనుదిరిగింది.
ఇదీ చదవండి: SRH బౌలర్లను చెడుగుడు ఆడుకున్న దినేష్ కార్తీక్.. 8 బంతుల్లో 30 పరుగులు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస విజయాల ట్రాక్ నుంచి వరుస ఓటముల బాట పట్టడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. ఒక్క బౌలర్ కూడా 6 ఎకానమీతో బౌలింగ్ చేసే పరిస్థితి లేదు. ప్రతి బాల్ ను బౌండరీకి తరలిస్తుంటే సైరన వ్యూహం, ప్రణాళిక లేకుండానే మ్యాచ్ మొత్తాన్ని ప్రత్యర్థి చేతికి అప్పజెప్పేస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో బలంగా కనిపించిన హైదరాబాద్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శనను కొనసాగిస్తోంది. మొత్తం 11 మంది ప్లేయర్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. నలుగురు డకౌట్ గా పెవిలియన్ చేరగా.. నలుగురు ప్లేయర్లు 10లోపే స్కోర్ చేశారు.ఇంక ఫీల్డింగ్ విషయానికి వస్తే అత్యంత కీలక సమయంలో క్యాచ్ డ్రాప్ చేయడం, బాల్ ను సరిగ్గా ఆపకపోవడం జట్టుకు ఎంతో నష్టం చేసింది. మ్యాచ్ స్టార్టింగ్ లో అభిషేక్ శర్మ డుప్లెసిస్ క్యాచ్ ను డ్రాప్ చేశాడు. ఆ తర్వాత ఫాఫ్ 73 పరుగులు నాటౌట్ గా నిలిచాడు. లాస్ట్ ఓవర్లో రాహుల్ త్రిపాఠి బౌండరీపై నిల్చుని ధినేష్ కార్తీక్ కొట్టిన షాట్ ను క్యాచ్ డ్రాప్ చేయడమే కాకుండా సిక్స్ గా మలిచాడు. అ తర్వాత డీకే సిక్సులతో చెలరేగిపోయాడు. కేవలం 8 బంతుల్లోనే 30 పరుగులు స్కోర్ చేశాడు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో సమష్టిగా పేలవ ప్రదర్శనతో కొనసాగుతూ వరుస ఓటములతో కొనసాగుతోంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ తరహా ప్రదర్శనతో హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ చేరగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ila aite kashtam mama pic.twitter.com/J4e974Q2by
— tiru (@tiru9676) May 9, 2022
#PlayBold #IPL2022 #RCB #ನಮ್ಮRCB #GoGreen #ForPlanetEarth #SRHvRCB pic.twitter.com/0jnSMalItd
— Royal Challengers Bangalore (@RCBTweets) May 8, 2022