మహేంద్ర సింగ్ ధోనీని ఇష్టపడని వారు బహుశా ఎవరూ ఉండరేమో. ఇంతలా.. అభిమానం సంపాదించుకున్న ధోనికి ఇప్పుడు ఒక స్టార్ క్రికెటర్ భక్తుడైపోయాడు. ఏకంగా ధోని ఫామ్ హౌస్ లో పని చేస్తానని చెప్పుకొచ్చాడు.
మహేంద్ర సింగ్ ధోనీని ఇష్టపడని వారు బహుశా ఎవరూ ఉండరేమో. కోట్లాది మంది అభిమానులు, సహచరులతో పాటుగా.. దిగ్గజాలు సైతం మహేంద్రుడికి అభిమానులుగా మారిపోతున్నారు. ఫాలోయింగ్, క్రేజ్ రోజురోజుకీ ఎక్కువవుతుందే గాని అస్సలు తగ్గడం లేదు. ఇదే ధోని చివరి ఐపీఎల్ సీజన్ అని భావిస్తున్న అభిమానులు ధోని మీద చూపించే అభిమానం ప్రత్యేక్షంగా కనబడింది. స్టేట్ ఏదైనా.. అక్కడ ధోని ఫ్యాన్స్ ఉండాల్సిందే. మొత్తం ఎల్లో కలర్ తో నిండిపోవాల్సిందే. ఇంతమంది అభిమానం సంపాదించుకున్న ధోనిని చూసి ఒక స్టార్ ప్లేయర్ ఫిదా అయిపోయాడు. అతడెవరో కాదు ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్. ఇతడి అభిమానం ఎక్కడికో వెళ్ళిపోయింది.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో 730 పరుగులు చేసి టాప్ స్కోరర గా నిలిచాడు డుప్లెసిస్. గత రెండేళ్లుగా ఆర్సీబీ జట్టుకి ఆడుతున్న ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్.. అంతకు ముందు చెన్నై తరపున ఓపెనర్ గా బరిలోకి దిగి ఇరగ దీసాడు. 2021 లో ఒక్కపరుగు తేడాతో సహచరుడు గైక్వాడ్ కి ఆరెంజ్ క్యాప్ ని కోల్పోయాడు. తాజాగా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 100కి పైగా మ్యాచులు ఆడిన ఫాఫ్ డుప్లిసిస్, సౌతాఫ్రికా20 లీగ్‌లో సీఎస్‌కే టీమ్ తరుపునే ఆడుతున్నాడు. దీంతో ధోని గురించి మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు.
“చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉండడం నా అదృష్టం. ధోనీ క్రికెట్ జ్ఞానం, అనుభవం నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఓ ప్లేయర్‌గా చాలామంది కెప్టెన్సీలో ఆడడాన్ని ఎంతగానో ఎంజాయ్ చేశా. గ్రేమ్ స్మిత్, ఏబీ డివిల్లియర్స్ వంటి కెప్టెన్ల సారథ్యంలో సౌతాఫ్రికాకి ఆడాను. ధోనీతో ఆడడాన్ని చాలా ఎంజాయ్ చేశా..క్రికెట్‌తో పాటు నాకు రాంఛీలోని ధోనీ ఫామ్ హౌజ్ చాలా నచ్చింది. క్రికెట్ ఫీల్డ్‌లో లెజెండరీ స్టేటస్ సంపాదించిన ధోనీ, ఫామ్‌హౌజ్‌లో ట్రాక్టర్ నడుతుండడం చూసి షాక్ అయ్యా. అంత సింపుల్‌గా ఎలా ఉండగలడో అర్థం కాలేదు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఆయన ఫామ్‌హౌజ్‌లో పనిచేయాలని ఉంది. అందుకు ఆయన ఒప్పుకుంటే ఇప్పుడే వెళ్లిపోతా”. అంటూ డుప్లెసిస్ కామెంట్ చేశాడు. మరి డుప్లెసిస్ ధోని మీద చూపించిన అభిమానం మీకేవిధంగా అనిపించిందో కామెంట్లు రూపంలో తెలపండి.