ప్రస్తుతం అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఈ మ్యాచులో భాగంగా కెప్టెన్ డుప్లెసిస్ పట్టిన ఒక క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది.
ప్రస్తుతం అమెరికా వేదికగా మేజర్ క్రికెట్ లీగ్ జరుగుతుంది. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో . ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎంఐ న్యూయార్క్ టీమ్‌తో మ్యాచ్ జరగ్గా.. అభిమానులు భారీగా హాజరయ్యారు. ఇప్పటివరకు ఈ టోర్నీ ప్రారంభమై చాలా మ్యాచులు జరిగినప్పటికీ ఈ మ్యాచ్ కి మాత్రం ఇంత భారీ మొత్తం ఫ్యాన్స్ రావడం ఇదే తొలిసారి అని లీగ్ వర్గాల వారు తెలిపారు. ఐపీఎల్ లో ఈ రెండు జట్లు పోటీపడితే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సేమ్ అదే సీన్ అమెరికా మేజర్ లీగ్ లో కూడా కనపడడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ మ్యాచులో చెన్నై టీం విజయం సాధించగా కెప్టెన్ డుప్లెసిస్ పట్టిన ఒక క్యాచ్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది.
కీలక సమయంలో క్యాచ్ అందుకుంటే చాలు మ్యాచ్ గెలిచేసినట్లే. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాదు కొన్ని సార్లు అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం ద్వారా ప్రత్యర్థిపై విజయం సాధించవచ్చు. అలాంటి సీన్ నేడు జరిగిన మ్యాచులో రిపీటైంది. చివరి 6 బంతుల్లో ఎంఐ న్యూయార్క్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. సాధారంగా చివరి ఓవర్లో ఇంత కొట్టాలంటే కాస్త కష్టమైనా విషయమే. కానీ క్రీజ్ లో ఆస్ట్రేలియన్ విధ్వంసకర ఫినిషర్ టిం డేవిడ్ క్రీజ్ లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంన్నో మ్యాచులు గెలిపించిన డేవిడ్ కి ఈ టార్గెట్ కొట్టేస్తాడని భావించారు. మొదటి బంతికే భారీ షాట్ కి ప్రయత్నించగా బంతి గాల్లోకి లేచింది.
ఇక అప్పటికే బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డుప్లెసిస్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. దీంతో సూపర్ కింగ్స్ టెక్సాస్ విజయం ఖాయమైపోయింది. డుప్లెసిస్ పట్టిన ఈ క్యాచ్ తోనే చెన్నై చివర్లో విజయం సాధించగలిగింది. ఇలాంటి క్యాచులు డుప్లెసిస్ ఐపీఎల్ లో ఎన్నో అందుకోవడం మనం చూసాము. తాజాగా మరోసారి తన మార్క్ క్యాచ్ తో ఆకట్టుకున్నాడు. నాలుగు పదుల వయసులో కూడా ఫీల్డింగ్ లో అదరగొడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం డుప్లెసిస్ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఇక ఈ మ్యాచులో చెన్నై విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో ముంబై జట్టు 136 పరుగులకే పరిమితమైంది. మరి డుప్లెసిస్ పట్టిన ఈ క్యాచ్ మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
FAF TAKES A BLINDER! 🫣
Is that the game? pic.twitter.com/oPn4m2fo7x
— Major League Cricket (@MLCricket) July 18, 2023