కోహ్లీ సెంచరీ సెంటిమెంట్.. ఆర్సీబీకి కప్ పై ఆశలు పెంచుతోంది. బెంగళూరు జట్టులో ఆ సీజన్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అదే టైమ్ లో కొన్ని జరిగితే ఆర్సీబీ టైటిల్ విన్నర్ పెద్ద కష్టమేం కాదనిపిస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది?
ఆర్సీబీ.. ఐపీఎల్ కప్ కొడితే చూడాలని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి కోరిక. గత 15 ఏళ్లుగా ఈ టోర్నీలో ఆడుతోంది. మూడుసార్లు ఫైనల్ కి వెళ్లింది. కానీ ఏం లాభం.. ప్రతి సీజన్ లోనూ ‘ఈ సాలా కప్ నమదే’ స్లోగన్ తో బరిలోకి దిగడం.. చివరికొచ్చేసరికి ‘నెక్స్ట్ సాలా కప్ నమదే’ అనుకోవడం కామన్ అయిపోయింది. ఈ సీజన్ లో ఆర్సీబీ కప్ కొడుతుందని చెప్పం గానీ ఎందుకో కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. కొన్ని సెంటిమెంట్స్ కూడా ఓ సీజన్ తో పోలిక అనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కనబెడితే కొన్ని జరిగితే ఆర్సీబీ టైటిల్ సమస్య తీరిపోవచ్చు. ఇంతకీ ఏంటి సంగతి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్లే ఆఫ్స్ కి చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన పోరులో ఆర్సీబీ గెలిచింది. సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ సెంచరీతో రెచ్చిపోయాడు. ఆర్సీబీ విజయం సాధించేలా చేశాడు. సరిగ్గా ఇదే రోజు అంటే 2016 మే 18న పంజాబ్ పై కోహ్లీ సెంచరీ చేయడం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు సేమ్ తేదీన సెంచరీ చేయడం కోహ్లీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. ఆ సీజన్ లో ఆర్సీబీ ఫైనల్ కి వెళ్లింది కానీ సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ జట్టు అసలు ఫ్లే ఆఫ్స్ రేసులోనే లేదు. కాబట్టి ఈ సీజన్ లో ఆర్సీబీ టాప్-4లో అడుగుపెట్టి, అద్భుతమైన ప్రదర్శన చేస్తే కప్ గెలిచే ఛాన్సులు కాస్త గట్టిగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు.
ఈసారి ఆర్సీబీ కప్ కొడుతుందనే పాజిటివ్ వైబ్స్ కనిపించడానికి మరో కారణం కోహ్లీ-డుప్లెసిస్ ద్వయం. 2016లో కోహ్లీ-డివిలియర్స్ కలిసి 800 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పుడు కోహ్లీ-డుప్లెసిస్ కలిసి.. ప్రస్తుత సీజన్ లో ఆ మార్క్ ని ఆల్రెడీ అందుకున్నారు. ఇవన్నీ పక్కనబెడితే.. ఆర్సీబీ టైటిల్ రేసులో నిలవాలంటే గుజరాత్ తో ఆదివారం జరిగే మ్యాచ్ లో మంచి తేడాతో విజయం సాధించాలి. అదే టైంలో ముంబయి, సన్ రైజర్స్ చేతిలో ఓడిపోవాలి లేదంటే తక్కువ పరుగుల తేడాతో గెలవాలి. అప్పుడే రన్ రేట్ విషయంలో ఆర్సీబీ ముందుంటుంది. ప్లే ఆఫ్స్ కి ఈజీగా అర్హత సాధిస్తుంది. ఇలా ఇవన్నీ వర్కౌట్ అయితే 2016లో మిస్ అయిన కప్ ని ఆర్సీబీ గెలుచుకోవచ్చు. సో అదన్నమాట విషయం. మరి ఈసారి ఆర్సీబీ కప్ గెలిచే ఛాన్సు ఉందని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.