ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. 8 వరుస పరాజయాల తర్వాత గెలుపు రూచిచూసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన పూర్ ఫామ్‌ను కొనసాగించాడు. కేవలం రెండు పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. పవర్‌ప్లేలో అశ్విన్ వేసిన మూడో ఓవర్ మూడో బంతిని స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిచెల్ దాన్ని అందుకున్నాడు.
దీంతో స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న రోహిత్ శర్మ భార్య రితిక కూడా భావోద్వేగానికి గురైంది. బర్త్‌డే రోజు రోహిత్ తక్కువ పరుగులకే అవుట్ అవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది. తనతోపాటు పక్కనే కూర్చోని మ్యాచ్ చూస్తున్న అశ్విన్ భార్య పృథ్వీ నారాయణన్.. రితికను ఓదారుస్తూ కనిపించింది. రోహిత్ శర్మ ఆడే అన్ని మ్యాచ్‌లకు హాజరయ్యే రితిక రోహిత్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. శనివారం మ్యాచ్‌లో రోహిత్ త్వరగా అవుట్ అవ్వడంతో కాస్త ఎమోషనల్ అయింది. చివరికి ముంబై మ్యాచ్ గెలవడంతో సంతోషంగా కనిపించింది.
ఇక మ్యాచ్ విషయాని వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఇంకో నాలుగు బంతులు మిగిలివుండగానే ఈ లక్ష్యాన్ని ఛేదించింది ముంబై. సూర్యకుమార్ యాదవ్, హైదరాబాదీ తిలక్ వర్మ రాణించారు. సూర్యకుమార్ యాదవ్ 39 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 51, హైదరాబాదీ తిలక్ వర్మ 30 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 35 పరుగులు చేశారు. చివర్లో టిమ్ డేవిడ్ దూకుడుగా ఆడాడు. తొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా ఇంకా నాలుగు బంతులు మిగిలివుండగానే జట్టు విజయాన్ని అందుకుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: GT vs RCB: బౌలర్ తప్పు లేకుండానే నో బాల్ ఇచ్చిన థర్డ్ అంపైర్!
A lovely moment happened during #RRvMI contest when Ashwin’s wife Prithi hugged #RohitSharma‘s wife Ritika
WATCH: https://t.co/WpoeEHfOTz
— Zee News English (@ZeeNewsEnglish) April 30, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.