ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ జట్టు దారుణంగా విఫలం అయింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీలు గెలిచిన జట్టు.. ఈ సీజన్‌లో మాత్రం ఇంటి దారి పట్టిన తొలి జట్టుగా నిలిచింది. వరుసగా 8 మ్యాచ్‌ల్లో ఓడి అప్రతిష్టను మూటకట్టుకుంది. జట్టులోని ఆటగాళ్లు అంతా విఫలం అయ్యారు. కానీ.. యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ మాత్రం.. నిలకడగా రాణిస్తూ ముంబై జట్టులో తురుపుమొక్కగా మారాడు. చాలా మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు వెన్నుముకగా నిలిచాడు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో ముంబై బ్యాటర్లు తడబడ్డారు.
ఓపెనర్లు ఇషాన్ కిషన్(6), రోహిత్ శర్మ(18), డేనియల్ సామ్స్(1), ట్రిస్టన్ స్టబ్స్(0), హృతిక్(18) పరుగులు చేసి పెవిలియన్ చేరినా.. తిలక్ వర్మ 32 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగలతో నాటౌట్‌గా నిలిచి ముంబైని విజయ తీరాలకు చేర్చాడు. ఈ సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న తిలక్ వర్మ.. తన టాలెంట్ ప్లస్ టెక్నిక్‌తో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ విపరీతంగా ఆకట్టుకున్నాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన రోహిత్ శర్మ తిలక్ వర్మను ప్రశంసలతో ముంచెత్తాడు. తిలక్ వర్మలో పరుగులు చేయాలని కసితో పాటు టెక్నిక్, టెంపర్‌మెంట్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. తిలక్ త్వరలోనే అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించనున్నాడని అన్నారు.
రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌తో పాటు.. టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో అతనే కెప్టెన్. సాక్ష్యాత్తు జాతీయ జట్టు కెప్టెనే ఈ మాట అనడంతో ఐపీఎల్ తర్వాత తిలక్ వర్మ టీమిండియాలోకి వస్తాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. పైగా మన తెలుగు వాడైన తిలక్ వర్మ దేశానికి ప్రాతినిథ్యం వహించడం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వకారణం అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఐపీఎల్ తర్వాత టీమిండియా సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఐపీఎల్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరికొంతమంది టీమిండియా ఆటగాళ్లు దారుణంగా విఫలం అయ్యారు. దీంతో వారిలో కొంతమందికి విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వారి స్థానంలో తిలక్ వర్మకు జట్టులో చోటు ఖాయమని అంతా భావిస్తున్నారు. విరాట్ కోహ్లీ వన్‌డౌన్ స్థానంలో తిలక్ ఆడే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: MS Dhoni: ముంబై చేతిలో చెన్నై చిత్తు! గుణపాఠమన్న ధోని
#IPL2022 | “Playing for the first year, having such a calm head is never easy”
Rohit Sharma backs Tilak Varma to play for India soon | #CSKvMI #Cricket https://t.co/pNkQXL1u7e
— India Today Sports (@ITGDsports) May 12, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.