ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉంది. పొట్టి క్రికెట్ మహా సంగ్రామం కోసం కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. జట్లు ఇప్పటికే ప్రాక్టీసు మ్యాచుల్లో తమ సత్తా చాటేస్తున్నారు. ఐపీఎల్ అనగానే గ్రౌండ్ లో ఎంత మజా ఉంటుందో.. అటు సోషల్ మీడియాలోనూ అంతే హంగామా ఉంటుంది. అయితే ఈసారి ఓ వింత ఘటన జరిగింది. ఎక్కడన్నా ఒక టీమ్ ట్విట్టర్ పోస్టులపై పక్క టీమ్ వాళ్లు కోపగించుకోవచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ఆ టీమ్ కెప్టెన్ సొంత టీమ్ ట్విట్టర్ అడ్మిన్ పై నిప్పులు చెరిగాడు. అతనిపై కంప్లైంట్ కూడా చేసినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ధోని నిర్ణయంతో టాప్‌లోకి రోహిత్ శర్మ! అట్టడుగు స్థానంలో జడేజా
ఇదంతా రాజస్థాన్ రాయల్స్ జట్టు గురించే. అవును ఆ జట్టు కెప్టెన్ కు వారి ట్విట్టర్ అడ్మిన్ పై కోపం వచ్చింది. ఎందుకంటే సంజు శాంసన్ ఫన్నీ ఫొటో ఒకటి అతను అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్టుకు సంజు శాంసన్ రిప్లై ఇచ్చాడు. ‘ఇది ఫ్రెండ్స్ సర్కిల్ లో పోస్టు చేయడం అంటే ఓకే. కానీ, ఒక జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం ఏంటి? కాస్త ప్రొఫెషనల్స్ గా ప్రవర్తించండి’ అంటూ ట్వీట్ చేశాడు. సంజు ట్వీట్ చేసిన కాసేపటికి అడ్మిన్ ఆ పిక్ డిలీట్ చేశాడు. ఆ తర్వాత ఈ అంశంపై యాజమాన్యంతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అయితే ఆ అడ్మిన్ ఉద్యోగం ఊడిపోయి ఉంటుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. సంజు రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Its ok for friends to do all this but teams should be professional..@rajasthanroyals https://t.co/X2iPXl7oQu
— Sanju Samson (@IamSanjuSamson) March 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.