ఐపీఎల్ 2022 సీజన్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో చెన్నై అభిమానులకు ఎంఎస్ ధోనీ పెద్ద షాకిచ్చాడు. అయితే దానిని షాక్ అనాలో.. ముందుచూపు అనాలో సీజన్ మొదలైతేగానీ చెప్పలేం. చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలను జడేజాకు అప్పగించాలని ధోనీ నిర్ణయించుకున్నాడు. ధోనీ తీసుకున్న నిర్ణయాన్ని ఫ్రాంచైజీ కూడా అంగీకరిచింది. ఈ సీజన్ లో ఐపీఎల్ అభిమానులు జడేజా కెప్టెన్సీ చూడబోతున్నారు.
ఇదీ చదవండి: గంగూలిని తాకిన పుష్ప ఫీవర్.. షాకిచ్చిన బుడతడు..
2012 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో జడేజా ఒక కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. స్టార్ ఆల్రౌండర్ గా జడేజా టీమ్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ధోనీ, జట్టు యాజమాన్యం ఎంపిక కూడా సరైందేనని అభిమానులు భావిస్తున్నారు. గతంలో ఒకసారి ధోనీ తర్వాత జట్టు బాధ్యతు ఎవరు తీసుకుంటే బాగుంటుందని ఓ ఫ్యాన్ పేజ్ పెట్టిన పోస్టుకు జడేజా తన జెర్సీ నంబరు కామెంట్ చేసి తర్వాత డిలీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే చివరకి అదే నిజం అయ్యింది. ధోనీ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
📑 Official Statement 📑#WhistlePodu #Yellove 💛🦁 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.