ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ మార్కో జన్సేన్ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి ఏకంగా 63 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు జన్సేన్. అంతకుముందు ఈ రికార్డ్ చెన్నై బౌలర్ లుంగి ఎంగిడి పేరిట ఉండేది. 2019లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఎంగిడి 62పరుగులు ఇచ్చాడు.
ఇప్పుడు ఆ చెత్త రికార్డును జన్సేన్ బద్దలు కొట్టి కొత్త రికార్డును సృష్టించాడు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన జన్సేన్ ఏకంగా 22 పరుగులు ఇచ్చి.. SRH ఓటమికి కారణమయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన్ సన్ రైజర్స్.. అభిషేక్ శర్మ (65పరుగులు 42బంతుల్లో 6ఫోర్లు 3సిక్సర్లు), మార్క్రామ్ (56పరుగులు 40బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. చివర్లో శశాంక్ సింగ్ (25పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) రాణించడంతో 195పరుగులు చేసింది. ఇక ఛేదనకు దిగిన గుజరాత్ ఓపెనర్ సాహా (68పరుగులు 38బంతుల్లో 11ఫోర్లు 1సిక్సర్లు), శుభ్‌మన్ (22) రాణించగా.. చివర్లో రాహుల్ తెవాతీయా (40పరుగులు 21బంతుల్లో 4ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్), రషీద్ ఖాన్ (31పరుగులు 11 బంతుల్లో 4సిక్సర్లు నాటౌట్ ) చెలరేగడంతో గుజరాత్ చివరి బంతికి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇదీ చదవండి: గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిన SRH.. ఆగ్రహంతో ఊగిపోయిన ముత్తయ్య
Marco Jansen Conceded 63 runs in Today’s match
Conceding 60 or more runs in an IPL match (Team Wise)
4 times – SRH*
3 times – PBKS
2 times – RCB
2 times – DC
1 time – CSK
1 time – RR
1 time – KKR
0 time – MI 😮#SRHvsGT— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) April 27, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.