బీసీసీఐ దారుణంగా ప్రవర్తించింది. వేల కోట్లతో నిర్వహిస్తున్న ఐపీఎల్ లో ఓ విషయం పట్ల విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఈ విషయమే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్ ని క్రికెట్ ఫ్యాన్స్ ఇన్ని రోజులు ఎంటర్ టైన్ మెంట్ గానే చూశారు గానీ ఇందులోనూ చాలా దారుణాలు ఉంటాయని గుర్తించలేకపోయారు. మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఈ లీగ్ పేరు చెప్పగానే బ్యాటర్లు బాదే సిక్సులు, ఫోర్లు.. ప్రేక్షకులు చేసే హడావుడి, స్టేడియం మొత్తం గోలగోల ఇవే గుర్తొస్తాయి. ఇలా చాలా గుర్తొస్తాయి. వాళ్లతో పాటు చీర్ గర్ల్స్ కూడా ఐడియా వస్తారు. ఇప్పుడు వాళ్ల విషయంలో బీసీసీఐ-ఐపీఎల్ పాలకమండలి దారుణంగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రతి ఒక్కరూ భారత క్రికెట్ బోర్డుని తిడుతున్నారు.
అసలు విషయానికొచ్చేస్తే.. ఐపీఎల్ లోని ప్రతి టీమ్ లో 20 మందికి పైగా ప్లేయర్లు, వాళ్లలో అందరికీ కాకపోయినా కొందరికి మాత్రం కోట్లకు కోట్లు డబ్బు పెడుతుంటారు. ఏ చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ ఉంటారు. ఆయా ఫ్రాంచైజీలతోపాటు బీసీసీఐ కూడా ఆటగాళ్ల విషయంలో చాలా కేర్ తీసుకుంటూ ఉంటుంది. వాళ్లకు ఏ చిన్న గాయమైనా సరే రెస్ట్ ఇచ్చేస్తారు. సకల సౌకర్యాలు చేస్తారు. ఇదంతా నాణానికి ఓవైపు. మరోవైపు మాత్రం చీర్ గర్ల్స్ ని బానిసల్లా చూస్తున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా గుజరాత్-హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా విరిగిన చేతితో ఎంటర్ టైన్ చేస్తూ కనిపించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 188/9 స్కోరు చేసింది. ఛేదనలో సన్ రైజర్స్ 154/9 పరుగులకే పరిమితమైంది. దీంతో 34 రన్స్ తేడాతో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్.. ప్లే ఆఫ్స్ లోకి అడుగుపెట్టింది. అదే టైమ్ హైదరాబాద్ ఇంటికెళ్లింది. ఇదే మ్యాచ్ లో సన్ రైజర్స్ చీర్ గర్ల్ ఒకామెకు చేయి విరిగింది. దానికి సపోర్ట్ గా నెక్ హోల్డ్ బ్యాండ్ పెట్టుకుంది. దానితోనే డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పొట్టకూటి కోసం పరాయి దేశం నుంచి చీర్ లీడర్స్ వస్తున్నారు. అంతమాత్రాన గాయాలైన సరే వాళ్లని డ్యాన్స్ చేయమని చెప్పడం అవసరమా అని నెటిజన్స్, బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.
One cheerleader arm is fractured but BCCI and IPL authorities want her to cheer for SRH.
Such a shame. #GTvsSRH pic.twitter.com/Q55kAX6fpq
— Rowan (@JustLikeGon) May 15, 2023