ఐపీఎల్ 2023 కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఈ నెల 31 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇన్నాళ్లు ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు ఏ మేరకు రాణిస్తారో అని అనుమానాలు ఉన్నా.. దానిని పటాపంచెలు చేసేలా చెలరేగి పోతున్నారు. ఒకరు డబుల్ సెంచరీతో సత్తా చాటితే.. మరొకరు వన్డే మ్యాచును టీ20లా మార్చేశారు. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో ఎక్కడలేని సంతోషం పుట్టుకొచ్చింది.
గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్ లో బాగా నిరాశపరుస్తున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. 11వ(2018) సీజన్ వరకు కాస్త బలంగా కనిపించినా.. శిఖర్ ధావన్, వార్నర్, బెయిర్ స్టో లాంటి ప్లేయర్లని వదిలేసుకోవడంతో ఆనాటి నుంచి జట్టు చాలా బలహీనంగా తయారైంది. ఆపై ఈ ఏడాది జట్టు సారథి, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు విలియమ్సన్ ను కూడా రిలీజ్ చేయడంతో.. హైదరాబాద్ అభిమానులు టైటిల్ మీద ఆశలు వదిలేసుకున్నారు. కానీ, మళ్ళీ ఆ ఆశలు అభిమానుల్లో చిగురించేలా ప్రస్తుత ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు.
ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ దేశవాళీ క్రికెట్లో ఇటీవలే డబుల్ సెంచరితో సత్తా చాటగా.. త్రిపాఠి టీమిండియా టీ20 జట్టులో స్థానం సంపాదించి దూకుడైన బ్యాటింగ్ తో దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుత ఎస్‌ఆర్‌హెచ్ సారథి మార్కరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరికి అండగా నిలవడానికి.. ఇంగ్లండ్ సంచలనం హ్యారి బ్రూక్, న్యూజీలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ ఉండనే ఉన్నారు. తాజాగా, దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ హెన్రిక్ క్లాసన్ కూడా వీరికి జత కలిశాడు. నేను మీకు ఏ మాత్రం తక్కువ కాదు అనే విధంగా వెస్టిండీస్ తో జరిగిన మ్యాచులో క్లాసన్ చెలరేగిపోయాడు.
ప్రస్తుతం వెస్టిండీస్- దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రోటీస్ గడ్డపై వన్డే సిరీస్ జరుగుతోంది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండో వన్డేలో విండీస్ జట్టు విజయం సాధించింది. ఇక చివరిదైన మూడో వన్డే మంగళవారం జరగగా, ఈ మ్యాచులో ఆతిథ్య జట్టు విజయం సాధిచింది. వెస్టిండీస్ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది. ఆ సమయంలో విజయానికి ఇంకా 180 పరుగులు చేయాల్సి ఉండటంతో దక్షిణాఫ్రికా జట్టు ఓటమి ఖాయమనుకున్నారంతా. కానీ, ఆ జట్టు వికెట్ కీపర్ క్లాసన్ విధ్వంసం ముందు లక్ష్యం చిన్నబోయింది.
Hundred by Heinrich Klaasen in just 54 balls – what an innings by Klaasen. South Africa were 87/4 at one stage chasing 261. pic.twitter.com/ZZbIak20fD
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2023
క్లాసెన్ తన ధనాధన్ బ్యాటింగ్ తో.. వన్డే మ్యాచ్ ని సైతం టీ20గా మార్చేశాడు. కేవలం 61 బంతుల్లోనే 119 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 15 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండగా.. కేవలం బౌండరీల రూపంలోనే 90 పరుగులు చేసాడు. ఈ మ్యాచ్ గెలుపుతో ఒక్క దక్షిణాఫ్రికా అభిమానులే కాదు సన్ రైజర్స్ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం జట్టులో అందరి ప్లేయర్ల ఫామ్ సన్ రైజర్స్ శిబిరంలో ఆనందాన్ని నింపగా.. క్లాసన్ ఇనింగ్స్ మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ మ్యాచ్ లో క్లాసన్ కి సహకరించిన మరో ఆటగాడు మార్కో జెన్సెన్(43) కూడా మన హైదరాబాద్ జట్టులో ఉండడం గమనార్హం. మరి ఇంతమంది ఆటగాళ్ల ఫామ్ నేపథ్యంలో సన్ రైజర్స్ జట్టు ఈ సారి టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s Heinrich Klaasen’s 5 sixes from yesterday 😱
P.S. You can watch #SAvWI 3rd ODI highlights on the FanCode app 😍 pic.twitter.com/6n52Uey0Uo
— FanCode (@FanCode) March 22, 2023
Heinrich Klaasen take a bow!#RSAvsWImatch ki thakkuva sunrisers practice camp ki ekkuva la undhi
Mottam mana srh Valle kanapaduthunnaru match lo pic.twitter.com/juYJNGhRnT— Nithin Kumar (@nithinkumar_18) March 21, 2023