క్రికెట్‌లో మంచి హైట్ ఉండే ఆటగాళ్లకు కొన్ని అడ్వాంటేజ్‌లు ఉండొచ్చు. కానీ.. టాలెంట్ ఉన్న వారికి అది పెద్ద విషయం కాదు. దాన్ని నిరూపించిన వ్యక్తి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు సచిన్ సౌతాఫ్రికా క్రికెట్‌లోనూ ఉదయిస్తున్నాడు.
భారత క్రికెట్‌కు సచిన్ టెండూల్కర్ ఓ దేవుడు. ఆటతో అతనికి ఆ స్థాయి వచ్చింది. హైట్ కూడా సచిన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఇంత పొట్టిగా ఉన్నాడు.. బౌన్సర్ల వేస్తూ భయపడిపోతాడోమో అని సచిన్ కెరీర్ ఆరంభంలో చాలా మంది అవాకులు చవాకులు పేల్చారు. కానీ.. బౌన్సర్‌ను అప్పర్ కట్ షాట్‌తో సిక్సులు కొట్టి మరీ.. కొత్త షాట్లను సృష్టించి, ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లను, బౌన్సర్లు బాగా సంధించే వారికి నిద్రలేకుండా చేశాడు. ప్రపంచ దిగ్గజ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. సచిన్ ఆటను చూసి ఇంకెవ్వరూ కూడా ఆటగాళ్ల హైట్ గురించి మాట్లాడే సహసం కూడా చేయలేదు. అది ప్రపంచ క్రికెట్‌లో సచిన్ లిఖించిన చరిత్ర. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఓ క్రికెటర్ హైట్ విషయంలో అప్పుడప్పుడు మీమర్లకు ముడిసరుకుగా మారుతున్నాడు. అతనే సౌతాఫ్రికా కెప్టెన్ టెంబ బవుమా. తాజాగా సౌతాఫ్రికా జట్టులోని మార్కో జాన్సన్ పక్కన చాలా పొట్టిగా ఉన్న బవుమా ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బవుమా ప్రస్తుతం సౌతాఫ్రికా టెస్టు, వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. భారత పర్యటనకు వచ్చినప్పుడు బవుమా పెద్దగా రాణించలేదు. దీంతో ఇతన్ని కెప్టెన్ ఎలా చేశారంటూ చాలా మంది చాలా మాటలు అన్నారు. అలాగే జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని ఆ దేశంలో జరిగిన మొట్టమొదటి టీ20 లీగ్‌లో ఏ ఫ్రాంచైజ్ కూడా బవుమాను కొనుగోలు చేయలేదు. అది బవుమాకు జరిగిన పెద్ద అవమానం. ఇలా కొంత కాలంగా అవమానాలు ఎదుర్కొంటున్న బవుమా ప్రస్తుతం తన ఫామ్‌తో ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వేలంలో బవుమాను ఎవరూ కొనకపోయినా.. లీగ్ చివర్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు బవుమాను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంది. బవుమా రాకతో ఆ జట్టే ఛాంపియన్‌గా నిలిచింది. ఇక స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో బవుమా రెండు భారీ సెంచరీలతో చెలరేగాడు. రెండో టెస్టులో 172 పరుగులతో సత్తా చాటిన బవుమా.. శనివారం ఈస్ట్ లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో మరో అద్భుత సెంచరీ సాధించాడు.
118 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సులతో 144 పరుగులు చేసి విలయతాండవం చేశాడు. మిగతా బ్యాటర్లు సహకరించకపోవడంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడిపోయినా.. కెప్టెన్‌గా బవుమా ఆడిన ఇన్నింగ్స్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురిసింది. అయితే.. ఇదే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్‌తో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో అతని పక్కన బవుమా నిలబడిన ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది. జాన్సన్ 6 అడుగుల 10 అంగుళాల హైట్ ఉంటాడు. అంటే దాదాపు రెండు అంగుళాల తక్కువ 7 అడుగులు. 5 అడుగుల 4 అంగుళాలు ఉంటే బవుమా అతని ముందు మరీ చిన్నగా కనిపిస్తున్నాడు. దీంతో ఆ ఫొటో వైరల్ అవుతుంది. అయితే.. ఈ ఫొటో చూసిన వారు.. బవుమా హైట్‌లో తక్కువగా ఉన్నా.. టాలెంట్‌లో మాత్రం తక్కువేం కాదని అంటున్నారు. భవిష్యత్తులో సౌతాఫ్రికాకు సచిన్ లాంటి ప్లేయర్‌గా మారుతాడంటూ కొనియాడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 19, 2023