సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది SRH యాజమాన్యం. లక్నోతో జరిగే రెండో మ్యాచ్ కు కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వస్తున్నట్లు ట్వీటర్ ద్వారా తెలియజేసింది యాజమాన్యం. దాంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అంటున్నారు. మరి జట్టులోకి రాబోతున్న ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2023 16వ సీజన్ లోకి భారీ అంచనాలతో బరిలోకి దిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలం అయ్యింది. తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఇక ఈ మ్యాచ్ కు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సారథ్యం వహించాడు. కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో.. SRH బ్యాటింగ్ లో.. బౌలింగ్ లో తేలిపోయింది. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ చెప్పింది SRH యాజమాన్యం. లక్నోతో జరిగే రెండో మ్యాచ్ కు కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వస్తున్నట్లు ట్వీటర్ ద్వారా తెలియజేసింది యాజమాన్యం. దాంతో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అంటున్నారు. మరి జట్టులోకి రాబోతున్న ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈసారి ఎలాగైన ఐపీఎల్ 2023 కప్ ను కొట్టాలి అన్న కసితో బరిలోకి దిగింది. అదీకాక తొలిసారి జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ ను కైవసం చేసుకున్న సన్ రైజర్స్ యాజమాన్యం.. అదే జోరును ఈ ఐపీఎల్ లో సైతం చూపించాలి అని అనుకుంది. అయితే తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఇక పరాజయానికి ప్రధాన కారణం జట్టులోకి కీలక ప్లేయర్స్ ఇంకా చేరకపోవడమే. దాంతోనే తొలి మ్యాచ్ ఓడిపోయారు సన్ రైజర్స్ టీమ్. కానీ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగే రెండో మ్యాచ్ కి కీలక ప్లేయర్స్ అందుబాటులోకి రానున్నారు. దాంతో SRH జట్టు స్ట్రాంగ్ గా మారబోతోంది. మరి ఇంతకి జట్టులోకి చేరబోయే ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు అనుకుంటున్నారా? అందులో ఓ ప్లేయర్ మనందరికి తెలిసినవాడే.. అతడే అయిడెన్ మార్క్ రమ్.
ఈ సీజన్ కు సన్ రైజర్స్ జట్టును నడిపించనున్నాడు ఈ సౌతాఫ్రికా స్టార్. అతడితో పాటుగా సౌతాఫ్రికా జట్టుకు చెందిన వికెట్ కీపర్ క్లాసెన్, ఆల్ రౌండర్ మార్కో జాన్సెస్ లు జట్టుతో కలవనున్నారు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో సన్ రైజర్స్ టీమ్ స్ట్రాంగ్ గా మారనుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ ను సన్ రైజర్స్ టీమ్ గెలుచుకోవడంలో మార్క్ రమ్ ది కీలక పాత్ర. ఇక తాజాగా నెదర్లాండ్స్ తో జరిగిన సిరీస్ లో కూడా అద్భుతంగా రాణించాడు మార్క్ రమ్. తన చివరి మ్యాచ్ లో 175 పరుగులు చేసి తన ఫామ్ ను మరోసారి ప్రత్యర్థులకు తెలిసేలా చేశాడు. ఇక ఈ విషయం తెలిసిన SRH ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి మార్క్ రమ్ ఏ మేరకు సన్ రైజర్స్ టీమ్ ను ముందుకు తీసుకెళ్తాడో వేచి చూడాలి. ఇక ఈ ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు SRH తలరాత మారుస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
And we all go, ProteYAAAAAS! 🤩 @AidzMarkram | #OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/RGZjtM7DDP
— SunRisers Hyderabad (@SunRisers) April 4, 2023