ఐపీఎల్ 2022లో సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీని సాధించి.. ప్లేఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఇక ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం ఢిల్లీ 14 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా.. పంజాబ్ 12 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. రెండు టీమ్స్‌కు ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఢిల్లీ ఆ మ్యాచ్‌లో గెలిస్తే దాదాపు ప్లేఆఫ్‌కు చేరినట్లే.. పంజాబ్ చివరి మ్యాచ్ గెలిచినా.. ఇతర టీమ్ ఫలితాలు, రన్‌రేట్‌పై ఆధారపడాలి. కాగా.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌కు ఒక భారీ అదృష్టం కలిసి వచ్చింది.
సహజంగా అయితే ఇలాంటి అదృష్టం క్రికెట్‌లో లభించడం అంటే చాలా గొప్ప విషయం. కానీ.. ఆ అదృష్టం పంజాబ్‌కు మాత్రం కొద్ది సేపు ఊరట తప్ప విజయం అందించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంజాబ్ బౌలర్లు 159 పరుగుల తక్కువ స్కోర్‌కే కట్టడి చేశారు. దీంతో 160 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు బెయిర్‌స్టో, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. ముఖ్యంగా బెయిర్‌స్టో ఫోర్లు, సిక్సులతో మంచి టచ్‌లో కనిపించాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 28 పరుగులు చేసిన బెయిర్‌స్టోను నోర్జే అవుట్ చేయడంతో ఓపెనింగ్ జోడి బ్రేక్ అయింది. తర్వాత ఫామ్‌లో ఉన్న రాజపక్స బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఇన్నింగ్స్ 5వ ఓవర్‌ను లలిత్ యాదవ్ వేస్తున్నాడు.. 4వ బంతిని ధావన్ సింగిల్ కోసం ఆడి వెంటనే పరుగు కోసం వచ్చాడు. కానీ.. అప్పటికే బౌలర్ లలిత్ యాదవ్ డై కొట్టి బాల్‌ను ఒడిసిపట్టాడు. దీంతో నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న రాజపక్స పరుగు కోసం రాలేదు. అప్పటికే ధావన్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌కు వచ్చేశాడు. ఇద్దరు బ్యాటర్లు ఒక ఎండ్‌లో ఉన్నారు.. కానీ లలిత్ యాదవ్ డై కొట్టి సరైన బ్యాలెన్స్‌లో లేకుండానే త్రో వేయడంతో అది కీపర్ పంత్ చేతుల్లోకి వెళ్లకుండా చాలా దూరంగా వెళ్లింది. దీంతో రాజపక్స పరుగు పూర్తి చేశాడు. అప్పటికే తొలి వికెట్ పడి ఉండటంతో ఒత్తిడి పెరిగింది. కానీ.. అదృష్టవశాత్తు రనౌట్ కాకపోవడంతో బతికిపోయింది పంజాబ్. ఇద్దరిలో ఎవరు అవుట్ అయినా కూడా జట్టుకు తీవ్ర నష్టం జరిగేదే. కానీ.. ఈ అదృష్టం వల్ల పంజాబ్ పెద్దగా ఏమీ ఒరగలేదు. మరుసటి ఓవర్‌లోనే ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 63 పరుగులు, సర్ఫరాజ్ 16 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో 32 పరుగులు చేసి రాణించారు. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. జితేష్ శర్మ 34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 44 పరుగులు చేసి రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో ధావన్, రాజపక్స ఇద్దరు బ్యాటర్లు ఒకే ఎండ్‌లో ఉన్నా అవుట్ కాకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Mohammed Shami: కెప్టెన్ అంటే అలా ఉండాలి… అందుకే హార్థిక్‌కు సలహా ఇచ్చా: షమీ
That over was… eventful 😅#IPL2022 #PBKSvsDC LIVE ▶️ https://t.co/CPNygJlnzD pic.twitter.com/b88y3YYM5n
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2022
Check out Confusion & a mix-up: Rajapaksa & Dhawan stranded at one end – No harm donehttps://t.co/Q7rqQn9ucp
😂😂— Bharath_MB (@BharathyadavMB) May 16, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.