టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధవన్ గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. గతేడాది బంగ్లాదేశ్ మీద చివరి వన్డే ఆడిన ధవన్..అప్పటి నుంచి జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే తాజా సమాచార ప్రకారం ధవన్ టీమిండియాలోకి అడుగు పెట్టనున్నాడని సమాచారం.
టీమిండియా స్టార్ ప్లేయర్ శిఖర్ ధవన్ గత కొన్ని నెలలుగా టీమిండియాకు దూరంగా ఉంటున్నాడు. టెస్టు, టీ 20 జట్టులో ప్లేస్ కోల్పోయిన ఈ స్టార్ ఓపెనర్ వన్డేల్లో మాత్రం నిలకడగా ఆడుతూ తన చోటుకి ఎలాంటి ముప్పు లేదని తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. అయితే న్యూజీలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లో వరుసగా విఫలమైన ధవన్ కి సెలక్టర్లు గట్టిగానే షాకిచ్చారు. కిషాన్, గిల్ లాంటి యంగ్ ప్లేయర్లు రాణించడంతో వన్డేల్లో ధవన్ పై వేటు వేయక తప్పలేదు. వరల్డ్ కప్ సమయానికి వస్తాడనుకున్నా సెలెక్టర్లు ఈ సీనియర్ ఓపెనర్ పై ఇంట్రస్ట్ చూపించలేదు. గతేడాది బంగ్లాదేశ్ మీద చివరి వన్డే ఆడిన ధవన్..అప్పటి నుంచి జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే తాజా సమాచార ప్రకారం ధవన్ టీమిండియాలోకి అడుగు పెట్టనున్నాడని సమాచారం.
ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు జరగనున్న ఈ టోర్నీకి చైనా ఆతిధ్యమిస్తుంది. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇండియన్ క్రికెట్ టీం ఆడకపోయినా.. టీ 20 ఫార్మాట్ లో క్రికెట్ కూడా నిర్వహిస్తుంది. ఇంతకుముందు కూడా ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు జరిగాయి. కానీ బీసీసీఐ ఈ క్రీడలపై అంతగా ఆసక్తి చూపించలేదు. అయితే తాజా సమాచార ప్రకారం ఈ సారి మన భారత క్రికెట్ జట్టుని కూడా ఈ టోర్నీకి పంపాలని బీసీసీఐ భావిస్తుందంట. అదే జరిగితే టీమిండియాకు ధావన్ ని కెప్టెన్ గా నియమించే ఛాన్స్ ఉంది.
ఈ క్రీడలు ఆడేందుకు భారత్-బి జట్టుని ధావన్ నేతృత్వంలో చైనాకి పంపనున్నారని బీసీసీఐ ప్లాన్ చేస్తుందట. ఇదే జరిగితూ రింకు సింగ్, తిలక్ వర్మ లాంటి ప్లేయర్లకి ఇదొక సువర్ణావకాశం. తమను తాము నిరూపించుకొని టీమిండియాలోకి అడుగుపెట్టడానికి ఒక మార్గం దొరికినట్టే. అంతేకాదు టీమిండియాలోకి సెలక్ట్ కానీ ధావన్ కి ఇదొక గొప్ప గౌరవంగా ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుందంట. ఆసియా క్రీడల్లో కనుక స్వర్ణం సాధిస్తే ధవన్ కెరీర్‌లో కూడా అరుదైన ఘనత చేరుతుందని నిపుణుల అభిప్రాయం. మొత్తానికి భారత-బి జట్టుతో శిఖర్ ధవన్ చేరనుండడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.