ఐపీఎల్ 2022లో సోమవారం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌ను పంజాబ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్‌కు ఈ సీజన్‌లో నాలుగో విజయం దక్కగా.. చెన్నై ఆరో ఓటమిని మూటగట్టుకుంది. కాగా ఈ మ్యాచ్ CSK ఓటమికి ఆ జట్టు కెప్టెన్ జడేజా అనే విమర్శలు వస్తున్నాయి. జడేజా స్లో బ్యాటింగ్‌తోనే చెన్నై ఈ మ్యాచ్‌ను చేజార్చుకుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పంజాబ్ నిర్ధేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 40 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.
రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ రబడా బౌలింగ్‌లో పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో చెన్నై 89 పరుగుల వద్ద 4వ వికెట్‌ను కోల్పోయింది. ఈ దశలో క్రీజ్‌లోకి వచ్చిన జడేజా.. అంబటి రాయుడితో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఒక వైపు రాయుడు భారీ షాట్లతో ప్రత్యర్థి బౌలర్లను ఎటాక్ చేస్తూ.. లక్ష్యం వైపు దూసుకెళ్తుంటే.. జడేజా మాత్రం చాలా నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 14 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటికే రాయుడు, ధోని అవుట్ అవ్వడంతో చెన్నై ఆశలు వదులుకుంది. ఇన్నింగ్స్ చివరి ఓవర్ 5వ బంతికి జడేజా సిక్స్ కొట్టాడు. కానీ అప్పటికే పంజాబ్ విజయం ఖాయమైంది. జడేజా కొట్టిన సిక్స్‌తో పంజాబ్‌కు ఎలాంటి నష్టం లేదు.
జడేజా అలాంటి షాట్లు ఆడడం చాలా లేట్ చేశాడు. చివర్లో కొట్టినా ఫలితం ఇచ్చే సిక్స్ కాదు. మొత్తం మీద 16 బంతులాడిన జడేజా కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. రాయుడు ఆడుతున్నంత సేపు చెన్నైకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ మరో ఎండ్‌లో జడేజా స్లో బ్యాటింగ్‌తో పరుగులు రావడం నెమ్మదించింది. అవసరమైన రన్‌రేట్ మించిపోవడంతో చెన్నైకు ఓటమి తప్పలేదు. జడేజా కొంచెం అగ్రెసివ్‌గా ఆడి ఉంటే ఫలితం మరోలా ఉండేదని CSK ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి జడేజా బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ముంబైని ముంచేసిన కిషన్ పై రోహిత్ సీరియస్ అయ్యాడా?
Ravindra Jadeja trying to play T20s since 13 years, biggest fraud pic.twitter.com/ioG82vttMV
— Smart MSDian (@HonestMsdFan) April 21, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.