స్వదేశంలో టెస్టు మ్యాచ్ జరిగితే చాలు టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా పోటీ పడీ వికెట్లు తీయడానికి రెడీగా ఉంటారు. కొన్నేళ్ల పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు నరకం చూపించిన అశ్విన్, జడేజా జోడీ అరుదైన జాబితాలోకి చేరిపోయింది.
రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా భారత క్రికెట్ చరిత్రలో ఈ జోడీ ప్రత్యర్థులకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా చేసింది. ప్రత్యర్థి బ్యాటర్ మైదానంలో దిగితే చాలు రెండు ఎండ్స్ లో స్పిన్ మ్యాజిక్ చూపిస్తూ ఎంత టాప్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తారు. టర్న్, బౌన్స్, ఫ్లిప్పర్, స్లైడర్, దూస్రా ఇలా వైద్యకరమైన బంతులేస్తూ బ్యాటర్లను కుదురుకోనీకుండా చేస్తారు. వీరి మాయాజాలానికి కాస్తయినా రిలాక్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ప్రతి ఓవర్, ప్రతి బంతి అప్రమత్తంగా ఉండాల్సిందే. కొన్నేళ్ల పాటు ప్రత్యర్థి బ్యాటర్లకు నరకం చూపించిన అశ్విన్, జడేజా జోడీ అరుదైన జాబితాలోకి చేరిపోయింది. అంతేకాదు మరో రెండు వికెట్లు తీసి చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.
స్వదేశంలో మ్యాచ్ జరిగితే చాలు టీమిండియా స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా పోటీ పడీ వికెట్లు తీయడానికి రెడీగా ఉంటారు. పేరుకి నలుగురు బౌలర్లతో బరిలోకి దిగినా పని మొత్తం వీరే కానిచ్చేస్తారు. వీరిద్దరూ బౌలింగ్ వేస్తున్నంత సేపు ఇద్దరు 10 వికెట్లు తీయడానికి వీరిద్దరు సరిపోతారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎన్నో సార్లు కలిసి టీమిండియాకు ఈజీ విక్టరీస్ అందించిన వీరిద్దరూ తాజాగా 500 వికెట్ల క్లబ్ లోకి చేరిపోయారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో వీరిద్దరూ ఈ ఘనతను సాధించారు. భారత్ తరపున ఈ లిస్టులో అనిల్ కుంబ్లే, హర్భజన్ ద్వయం కలిసి 501 వికెట్లు తీసుకున్నారు. ఇప్పటివరకు స్పిన్ లో అనిల్ కుంబ్లే, హర్భజన్ మాత్రమే 500 క్లబ్ లో ఉన్నారు. తాజాగా మరో భారత జోడీ ఆ లిస్టులోకి చేరిపోయారు. అంతేకాదు మరో రెండు వికెట్లు తీస్తే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్ జోడీగా చరిత్ర సృష్టిస్తారు.
ఈ లిస్టులో 1000 కి పైగా వికెట్లతో ఇంగ్లాండ్ జోడీ అండర్సన్,బ్రాడ్ ఉంటే ఆ తర్వాత ఆసీస్ లెజెండ్స్ మెగ్రాత్, షేన్ వార్న్(1001) రెండో స్థానంలో నిలిచారు. శ్రీలంకకు చెందిన మురళీధరన్, చమిందా వాస్(895) మూడో స్థానంలో.. విండీస్ భయంకర బౌలర్లు కోట్నీ వాల్ష్, అంబ్రూస్(762) నాలుగో స్థానంలో నిలిచారు. అనిల్ కుంబ్లే, హర్భజన్ 501 వికెట్లతో టాప్ 5 లో స్థానంలో సంపాదించారు. తాజాగా 500 క్లబ్ లోకి అశ్విన్, జడేజా చేరిపోయారు. ప్రస్తుతం వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఈ ఇద్దరు తమ ఫామ్ ని కొనసాగిస్తున్నారు. ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే క్రికెట్ లో వీరిద్దరి టెస్టుల్లో ఆల్ టైమ్ బెస్ట్ స్పిన్ ద్వయంగా నిలిచే అవకాశముంది. మొత్తానికి అశ్విన్, జడేజా జోడీ 500 వికెట్ల క్లబ్ లోకి చేరడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.