టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించి ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసాడు మహేంద్రసింగ్ ధోని. ఈ రోజు ధోని పుట్టిన రోజు కావడంతో జడేజా విష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఐపీఎల్ లో ధోని, జడేజా మధ్య ఉండే బంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఎప్పటినుంచో చెన్నై జట్టుకి ఆడుతూ ఎన్నో విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ మ్యాచులు ఆడేటప్పుడు కూడా వీరి సాన్నిహిత్యం అలాగే కొనసాగింది. రైనా తర్వాత ధోనికి బాగా దగ్గరైన వారు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జడేజా మాత్రమే. పలు ఇంటర్వూలో కూడా ఒకరి మీద మరొకరు ప్రశంసలు కురిపించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మంచి సఖ్యత లేదనే వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన తర్వాత తీవ్ర భావోద్వేగంతో ధోని.. జడేజాను ఎత్తుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి మధ్య వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఈ రోజు ధోని పుట్టిన రోజు కావడంతో జడేజా విష్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించి ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేసాడు మహేంద్రసింగ్ ధోని. అభిమానులతో భక్తులను కూడా సంపాదించుకున్నాడు. జూలై 7(ఈ రోజు) ధోని పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తనకు ఎంతగానో సన్నిహితుడైన జడేజా మిస్టర్ కూల్ కి తనదైన శైలిలో సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. “2009 నుంచి ఇప్పటివరకు నాకు ఎలాంటి అవసరం వచ్చినా ధోని చూసుకునేవాడు. నాకు సంబంధించి ఎలాంటి సలహాలు, సూచనలు కావాల్సిన మహీ భాయ్ దగ్గరకే వెళ్ళేవాడిని. పుట్టిన రోజు శుభాకాంక్షలు మహీ భాయ్. త్వరలో నిన్ను ఎల్లో జెర్సీలో చూడాలి” అని ట్వీట్ చేసి # respect జత చేసాడు. ప్రస్తుతం జడేజా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మొత్తానికి ధోనీ మీద తనకున్న ప్రేమను ఈ సారి ట్వీట్ ద్వారా జడేజా తెలియజేయడం మీకేవిధంగా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలపండి.
My go to man since 2009 to till date and forever. Wishing you a very happy birthday mahi bhai.🎂see u soon in yellow💛 #respect pic.twitter.com/xuHcb0x4lS
— Ravindrasinh jadeja (@imjadeja) July 7, 2023